దోమలు, ఇతర కీటకాల ద్వారా సంక్రమించే డెంగీ, మలేరియా, చికున్ గున్యా, జికా వైరస్, పైలేరియా వంటి వ్యాధుల చికిత్సకు ఆరోగ్య, సాధారణ బీమా సంస్థలు త్వరలో ప్రత్యేక పాలసీలు తీసుకు రానున్నాయి. ఇలాంటి వ్యాధుల చికిత్స కోసం బీమా రక్షణ కల్పించేందుకు త్వరలో ఆరోగ్య, సాధారణ బీమా సంస్థలను అనుమతించనున్నారు. ఏడాది కాలపరిమితితో ఇలాంటి పాలసీలను ఆఫర్ చేసేలా బీమా సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ IRDAI రెండు రోజుల క్రితం ఓ డ్రాఫ్ట్‌ను తీసుకు వచ్చింది.
దోమలు, కీటకాల ద్వారా వ్యాప్తిచెందే కొన్ని రకాల వ్యాధుల నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రామాణిక బీమా పాలసీని అందుబాటులోకి తీసుకు రావడం ఈ డ్రాఫ్ట్ ప్రధాన ఉద్దేశ్యమని IRDAI తెలిపింది. నిర్ధిష్ఠంగా ఏడాది కాలపరిమితి కలిగిన పాలసీని పదిహేను రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో ఆఫర్ చేయాలని ఈ డ్రాఫ్టులో ప్రతిపాదించింది. దీనికి సంబంధించి బీమా సంస్థలు ఈ నెల 27వ తేదీలోగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది.

డెంగీ చికిత్సకు రూ.25,000 నుండి రూ.70,000 వ్యయంగా నిర్ణయించవచ్చునని తెలుస్తోంది. IRDAI ముసాయిదాపై బీమా సంస్థలు తమ స్పందన తెలియచేసేందుకు దాదాపు రెండు వారాల సమయం ఉంది. ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండనుంది. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వారు ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications