LIC News: అనేక మంది పాలసీదారుల నుంచి సేకరించిన సొమ్మును ఎల్ఐసీ పెట్టుబడుల రూపంలో పెడుతుందని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ భారీ నష్టాలను చవిచూసింది.
ఈ రోజు మార్కెట్లలో ఐటీ షేర్ల పతనం కల్లోలాన్ని నింపింది. ఈ సెగ సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక అతిపెద్ద పెట్టుబడిదారైన ఎల్ఐసీని కూడా తాకింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు మార్కెట్లో దాదాపు 12 శాతం మేర పతనం కావటంతో వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈ క్రమంలో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని సెకన్లలోనే ఎల్ఐసీ భారీ నష్టాన్ని చవిచూసింది. దీనికి పేలవమైన క్యూ4 ఫలితాలే కారణంగా ఉన్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఎల్ఐసీ ఇన్ఫోసిస్ సంస్థలో 7.71 శాతం వాటా అంటే 28,13,85,267 షేర్లను కలిగి ఉంది. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి వీటి విలువ రూ.39,073 కోట్లుగా ఉంది. అయితే ఇన్ఫోసిస్ షేర్ 10 శాతం మేర పతనం కారణంగా సెకన్లలోనే రూ.3,907 కోట్ల సంపద ఆవిరైంది.
ఇన్ఫోసిస్ షేర్ల పతనం కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబంపై కూడా భారీగానే పడింది. కంపెనీలో ఆయన కుమారుడు రోహన్ మూర్తి వాటా రూ.8,444.47 కోట్లుగా ఉంది. అలాగే సంస్థలో కుమార్తె అక్షతా మూర్తికి రూ.5,409.58 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇక సుధా మూర్తికి కంపెనీలో రూ.4,797.69 కోట్ల విలువైన వాటాలున్నాయి. అలాగే నారాయణమూర్తి రూ.2,311.41 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీరి వాటాల విలువ సైతం వందల కోట్లలో క్షీణించింది.

దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ షేర్లకు సంబంధించిన టార్గెట్ ధరలను తగ్గించాయి. అలాగే ఇన్ఫోసిస్‌లో పెట్టుబడులపై ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,239.55 కోట్లను కోల్పోయింది. ఇక ICICI ప్రుడెన్షియల్ MF నోషనల్ హిట్‌లో రూ.1,226.79 కోట్లను నష్టపోయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications