LIC Investments: భారతదేశంలో ప్రజల నమ్మకాన్ని పొందిన ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా కంపెనీ ఎల్ఐసీ. అనేక దశాబ్ధాలుగా దేశంలోని వివిధ ఆదాయవర్గాలకు చెందిన ప్రజలకు బీమా సేవలతో పాటు, పెట్టుబడికి అనేక స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల నుంచి సేకరించిన డబ్బును ఎల్ఐసీ వివిధ ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేటు లిస్టెడ్ కంపెనీల్లో కూడా పెట్టుబడిగా పెడుతున్న విషయం తెలిసిందే.
అయితే గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు పతనంలో ఉండటంతో ఆ ప్రభావం ప్రస్తుతం ఎల్ఐసీ పెట్టుబడులపై కూడా పడింది. గడచిన నెలన్నర కాలంలో ఎల్ఐసీ పోర్ట్ ఫోలియో విలువ ఏకంగా రూ.84,247 కోట్ల భారీ తరుగుదలను చూసింది. ప్రభుత్వ బీమా సంస్థ హోల్డ్ చేస్తున్న షేర్ల విలువ మార్కెట్ పతనం కారణంగా తగ్గటంతో వేల కోట్ల సంపద ఆవిరైపోయిందని వెల్లడైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ దాదాపు 330 కంపెనీల్లో 1 శాతం వాటాను కంట్రోల్ చేస్తుండగా.. వీటిలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు మెుత్తం మార్కెట్ క్యాప్ కంపెనీలు మెజారిటీగా 66 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నాయి.

వాస్తవానికి డిసెంబరు త్రైమాసికం సమయంలో ఎల్ఐసీ మెుత్తం పెట్టుబడుల విలువ దాదాపు రూ.14.72 ట్రిలియన్లుగా ఉండగా.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ ఫిబ్రవరి 18 నాటికి క్షీణించిన తర్వాత రూ.13.87 ట్రిలియన్లుగా ఉన్నట్లు తెలింది. అంటే 5.7 శాతం క్షీణత కారణంగా మెుత్తం ఎల్ఐసీ పోర్ట్ ఫోలియో విలువ రూ.84,247 ఆవిరైపోయింది. ఈ క్రమంలో ఎల్ఐసీకి అత్యధికంగా నష్టాలను కలిగించిన కంపెనీ షేర్ల జాబితాను పరిశీలిస్తే.. ముందు వరుసలో ఐటీసీ స్టాక్ ఉంది. ఐటీసీ కారణంగా ఎల్ఐసీ రూ.11,863 కోట్లను కోల్పోగా.. స్టేట్ బ్యాంక్ షేర్ల వల్ల రూ.5,647 కోట్లు, ఎల్ అండ్ టీ స్టాక్ కారణంగా 6,713 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఎల్ఐసీ పెట్టుబడులను పెట్టి విలువ తగ్గిన కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. జియో ఫైనాన్షియల్స్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్యూ ఎనర్జీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో బజాజ్ ఫిన్‌సర్వ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్ , రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ వంటి అగ్రస్థాయి కంపెనీలు సైతం ఎల్ఐసీ పోర్ట్ ఫోలియోలో కొనసాగుతున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

కోవిడ్ తర్వాత రికార్డు స్థాయికి ఇండియా VIX.. భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications