LIC News: ఎల్ఐసీకి షాకిచ్చిన గుజరాత్ టాక్స్ అధికారులు.. భారీ పెనాల్టీ నోటీసులు..
LIC GST Notices: బీమా దిగ్గజం ఎల్ఐసీ వరుస షాక్స్ ఎదుర్కొంటోంది. పాత టాక్స్ చెల్లింపులను తవ్వితీస్తున్న కంపెనీలు కోట్లలో పన్ను బకాయిలతో పాటు పెనాల్టీలు చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నాయి. ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇలాంటి నోటీసులు పంపించాయి.
కాగా.. ఇదే జాబితాలో ప్రస్తుతం గుజరాత్ కూడా వచ్చి చేరిపోయింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు జీఎస్టీ బకాయిలకు సంబంధించిన రూ.382 కోట్లకు నోటీసులను పంపింది. ఇందులో రూ.191 కోట్లు వాస్తవ బకాయిలుగా చూపిన అధికారులు మిగిలిన రూ.191 కోట్లను పెనాల్టీలు, పెనాల్టీపై వడ్డీలుగా చెల్లించాలంటూ నోటీసులు పంపారు. అయితే కంపెనీ అనేక రాష్ట్రాల జీఎస్టీ అధికారుల నుంచి వస్తున్న వరుస నోటీసులతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన మెుత్తం నోటీసుల ప్రకారం కంపెనీ చెల్లించాల్సిన పన్ను బకాయిలు ఏకంగా రూ.1000 కోట్ల మార్కును దాటేశాయి. ఇదే క్రమంలో ఎల్ఐసీ మారిషస్ శాఖకు స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి రూ.9,500 పెనాల్టీకి సంబంధించిన నోటీసులు వచ్చాయి. పెనాల్టీని మాఫీ చేయాలని మారిషస్ శాఖ మారిషస్ రెవెన్యూ అథారిటీకి రిప్రజెంటేషన్ దాఖలు చేసింది. మారిషస్ ఆదాయపు పన్ను రెగ్యులేషన్స్ 2018ని పాటించనందుకు FY2018 నుంచి 2022 వరకు పెనాల్టీ డిమాండ్ విధించబడింది.
ఎల్‌ఐసీకి తమిళనాడు, ఉత్తరాఖండ్ గుజరాత్‌లోని పన్ను అధికారుల నుంచి రూ.667.5 కోట్ల మొత్తం డిమాండ్ ఆర్డర్ అందుకుంది. తమిళనాడు GST డిమాండ్ రూ.663.45 కోట్లు, ఉత్తరాఖండ్ పన్ను అధికారం రూ.4.28 కోట్లు, గుజరాత్ పన్ను అధికారం రూ.39.39 లక్షల పన్ను డిమాండ్‌ను ఉంచింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో ఎల్ఐసీ స్టాక్ ధర రూ.844.4 వద్ద ఉండగా ముగింపు నాటికి స్వల్పంగా లాభపడింది.


Click it and Unblock the Notifications