LIC News: నిరాశ పరిచిన జియో ఫైనాన్షియల్.. ఎల్ఐసీ వాటాల కొనుగోలు ఎంతంటే..?
LIC News: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అంబానీకి చెందిన రిలయన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ షేర్లు అడుగుపెట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయి ప్రత్యేక కంపెనీగా ఇది ఏర్పాటైన సంస్థ తెలిసిందే.
జియో ఫైనాన్షియల్ కంపెనీ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత పేలవమైన పనితీరును కనబరిచింది. మెుదటి రోజు కంపెనీ షేర్లు 5 శాతం నష్టపోగా.. నేడు రెండోరోజు సైతం స్టాక్ పతనాన్ని కొనసాగిస్తూ 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ప్రస్తుతం స్టాక్ ధర రూ.269.20 వద్ద ఉంది. షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం దీనికి ఒక కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈక్రమంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 6.660 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మంగళవారం ప్రకటించింది. సోమవారం ఉత్సాహంగా రూ.265 వద్ద లిస్ట్ అయిన జియో ఫైనాన్షియల్ స్టాక్ దాని డిస్కవరీ ధర కంటే కేవలం 1 శాతం ప్రీమియం వద్ద మార్కెట్లోకి తొలిరోజు అడుగుపెట్టింది. లిస్టింగ్ నాటికి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లుగా ఉంది. దీంతో కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన NBFC సంస్థగా నిలిచింది.
ప్రస్తుతం జియో ఫైనాన్షియల్స్ పొందిన 2.5 బిలియన్ డాలర్ల లిక్విడ్స్ కారణంగా సుమారు 13-15 బిలియన్ డాలర్ల లోన్ బుక్ పొందేందుకు అనుకూలత ఏర్పడిందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA పేర్కొంది. మెుత్తానికి రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చిన ఫైనాన్స్ కంపెనీలో దేశీయ ఇన్సూరెన్స్ దిగ్గజం భారీ మెుత్తంలోనే పెట్టుబడులను పెట్టింది. రానున్న కాలంలో ఇవి మంచి ఆదాయాలను అందించవచ్చని ప్రభుత్వ బీమా సంస్థ భావిస్తోంది.


Click it and Unblock the Notifications