Tata Group: టాటా షేర్లలో కలకలం.. హఠాత్తుగా 69 లక్షల షేర్లు అమ్మేసిన LIC..
Voltas Shares: టాటా గ్రూప్ కంపెనీ షేర్లంటే దేశంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో మక్కువ. అందుకే చాలా మంది టాటాలకు చెందిన అనేక లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులను దీర్ఘకాలం కోసం హోల్డ్ చేస్తుంటారు. అవి స్థిరమైన రాబడిని అందిస్తాయని వారి నమ్మకం.
అయితే మంగళవారం ట్రేడింగ్ సమయంలో ఒకపక్క మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతుండగా.. మరో పక్క టాటాలకు చెందిన వోల్టాస్ కంపెనీ షేర్లలో పెద్ద పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.1599.30కి చేరుకుంది. ఈ క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వోల్టాస్‌లో తన ఈక్విటీ హోల్డింగ్స్ తగ్గించుకుంది. వాస్తవంగా ఉన్న మెుత్తం 22,685,279 షేర్లలో 6,953,996 షేర్లను విక్రయించటంతో వాటాలు 15,731,283 షేర్లకు తగ్గాయి. దీంతో కంపెనీలో తన వాటాను 2.1 శాతం మేర తగ్గించుకోవటంతో అది 4.7 శాతానికి పరిమితం అయ్యింది.

వాటాల తగ్గింపు జూన్ 12 నుంచి ఆగస్టు 12 మధ్య కాలంలో జరిగింది. సగటున ఒక్కో వోల్టాస్ షేరును రూ.1,502.931తో బహిరంగ మార్కెట్‌లో లావాదేవీ జరిగింది. ప్రస్తుతం గృహోపకరణాల తయారీ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.52,038.24 కోట్లుగా ఉంది. కంపెనీ ఇండియాతో పాటు అంతర్జాతీయంగా EPC కాంట్రాక్టర్‌గా ఎయిర్ కండిషనింగ్, ఫ్రీజర్స్, ఎలక్ట్రో-మెకానికల్ ప్రాజెక్ట్‌ల వ్యాపారంలో చురుకుగా పనిచేస్తోంది. కంపెనీ మైనింగ్, వాటర్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రీట్‌మెంట్, నిర్మాణ పరికరాలు, వస్త్ర పరిశ్రమల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తి సేవల్లో కూడా నిమగ్నమై ఉంది.
వోల్టాస్ కంపెనీ జూన్ త్రైమాసికంలో లాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లకు చేరుకుంది. కంపెనీ తొలిత్రైమాసికంలో ఒక మిలియన్ ఏసీ యూనిట్ల అమ్మకాల "మైలురాయి"ని అందుకుంది. అలాగే కంపెనీ ఆదాయం క్యూ1లో రూ.5,000 కోట్లు దాటింది. జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వోల్టాస్ ఆదాయం 46.46 శాతం పెరిగింది. FY25 జూన్ త్రైమాసికంలో వోల్టాస్ మొత్తం ఖర్చులు 41.44 శాతం పెరిగి రూ.4,520.40 కోట్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications