LIC News: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆదాయాలను పెంచుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలోనే బీమా దిగ్గజం కొత్త ఫిన్‌టెక్ యూనిట్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఉన్న అవకాశాలను ఎల్‌ఐసీ అన్వేషిస్తోందని కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మహంతి తెలిపారు. ఎల్‌ఐసీ టోటల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్(డీఐఈఈ)ని ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఒక కన్సల్టెంట్‌ను నియమించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వాటాదారులు, కస్టమర్లు, మధ్యవర్తులు, విక్రయదారులు, ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ డిజిటల్ కార్యక్రమాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మహంతి చెప్పారు.

ఎప్పటి నుంచో ఎల్‌ఐసీ తన ఏజెంట్ల ద్వారానే ఎక్కువ మంది కొత్త కస్టమర్లను పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రారంభిస్తున్న DIVE ప్రాజెక్టు ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్, లోన్, ఇతర సేవలు ఒక బటన్‌పై 'క్లిక్' చేయటంతో అందుబాటులో ఉండేలా చేసేందుకు ఎల్ఐసీ ప్రస్తుతం కృషి చేస్తోంది. డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటం ద్వారా కస్టమర్లు తమ పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదని మెుహంతి స్పష్టం చేశారు.
ఎల్ఐసీ వినియోగదారులు తమ ఇంట్లో కూర్చుని కేవలం మొబైల్ ద్వారా అవసరమైన సేవలను యాక్సెస్ చేయవచ్చని మహంతి తెలిపారు. దీనికోసం తాము ఆర్థిక సాంకేతికతపై కూడా దృష్టి పెడుతున్నామన్నారు. డిజిటల్ సాంకేతిక సామర్థ్యాన్ని తమ వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తుందన్నారు. ఉత్పత్తుల పంపిణీ కోసం ప్రస్తుత సంవత్సరంలో కార్పోరేట్ ఏజెంట్లుగా LIC ఇప్పటివరకు మూడు ఫిన్‌టెక్ కంపెనీలను కలిగి ఉంది.
2023-24లో కొత్త పాలసీ ప్రీమియంల్లో రెండంకెల వృద్ధిని సాధించే లక్ష్యంతో రాబోయే నెలల్లో 3-4 కొత్త ఉత్పత్తులను ప్రారంభించాలని బీమా దిగ్గజం ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో ఎల్‌ఐసీ కొత్త సర్వీస్‌ను అందించబోతోంది. మార్కెట్‌లో ఈ ఆర్థిక ఉత్పత్తులకు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. 20-25 ఏళ్ల తర్వాత అతను ఎంత చెల్లిస్తున్నాడో, ఎంత రిటర్న్‌లు వస్తాయో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని, ఈ కొత్త సర్వీస్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుందని మహంతి విశ్వాసం వ్యక్తం చేశారు. ముందుగా పాలసీ విత్‌డ్రా, రుణ సదుపాయం కూడా కొత్త సర్వీస్ ఫీచర్లలో ఉన్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications