LIC News: ఆందోళనలో ఎల్ఐసీ ఇన్వెస్టర్లు.. బీమా దిగ్గజానికి జీఎస్టీ నోటీసులు..
GST News: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. ఎన్ని సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించినా ఇప్పటికీ నెం-1 స్థానంలో ఎల్ఐసీ కొనసాగుతోంది.
తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ మెుత్తంలో జీఎస్టీ నోటీసులను అందుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన నోటీసులను ఎల్ఐసీ అందుకుంది. వాస్తవానికి ఇవి FY 2017-18 కాలానికి సంబంధించినవిగా తెలుస్తోంది. ఈ డిమాండ్ నోటీసులో రూ.365.02 కోట్ల జీఎస్టీ చెల్లింపు బకాయిలతో పాటు రూ.404.7 కోట్ల పెనాల్టీతో పాటు రూ.36.5 కోట్ల వడ్డీ చెల్లింపులు ఉన్నాయి.

జీఎస్టీ అధికారుల ప్రకారం కంపెనీ CGST నియమాలు 37, 38 ప్రకారం ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను రివర్సల్ చేయకపోవడం, రీఇన్స్యూరెన్స్ నుంచి పొందే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను రివర్సల్ చేయడం వంటి వివిధ నియమాలను బీమా దిగ్గజం పాటించలేదని వెల్లడైంది. దీనికి అదనంగా GSTR-3Bతో ఆలస్యంగా చెల్లింపు చేయడం, స్వీకరించిన అడ్వాన్స్‌పై వడ్డీ ఫలితంగా బకాయిలకు జీఎస్టీ అధికారులు వడ్డీని జోడించారు.
ఈ నోటీసులను సవాల్ చేస్తూ.. కమిషనర్‌కు అప్పీలు దాఖలు చేయాలని ఎల్ఐసీ నిర్ణయించింది. ఈ నోటీసుల కారణంగా ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి భౌతిక ప్రభావం ఉండబోదని వెల్లడించింది. ఇదే క్రమంలో ఎల్ఐసీ ఇటీవలి కాలంలో బీహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారుల నుంచి సైతం నోటీసులను అందుకుంది. అయితే ఇది కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వార్తల నేపథ్యం నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ ధర స్వల్పంగా నష్టాల్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications