ప్రస్తుతం పరిస్థితుల్లో యువత చాలా గంటలు సోషల్ మీడియాల్లో (ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైనవి) గడిపేస్తున్నారు. అయితే పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అరవింద్ శ్రీనివాస్ తాజా ఇంటర్వ్యూలో యువత సోషల్ మీడియాలో సమయం వృథా చేయకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మాథ్యూ బెర్మాన్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ లో,బాగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో, AI నైపుణ్యాలను సాధించేవారికే భవిష్యత్ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.

AI వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, కనీసం ప్రతివారం కొత్తగా ఏదో ఒక కొత్త టెక్నాలజీని వెలుగు చూస్తుంది. టెక్నాలజీ బాగా వేగంగా మారుతోంది, అందుకు అనుగుణంగా వెంటనే మారిపోవడం యువతకు అంత సులభం కాదు" అని ఆయన అన్నారు. ఈ మార్పుకు తగ్గట్టుగా వేగంగా అడ్జస్ట్ అవకపోతే, రాబోయే ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"AI టూల్స్‌ను బాగా ఉపయోగించగలిగిన యువతకు ఉద్యోగాల విషయంలొ ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇతరులతో పోలిస్తే వారే ముందుండటం ఖాయం అని అన్నారు. సోషల్ మీడియా వల్ల వినోదం లభించినా, వృత్తి పరమైన అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడవని ఆయన స్పష్టం చేశారు."
AI వల్ల కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నా, అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా రావచ్చని శ్రీనివాస్ చెప్పారు. "ఉద్యోగాలు పోయినప్పుడు కొందరు తమ వ్యాపారం ప్రారంభించవచ్చు లేకపోతే AI టూల్స్ ఉపయోగించే కొత్త కంపెనీల్లో చేరవచ్చు" అని ఆయన చెప్పారు.
AI వల్ల ఉద్యోగాల్లో మార్పులు రావడం ఖాయం. Claude chatbot తయారుచేసే Anthropic సంస్థ వాదన ప్రకారం, వచ్చే ఐదేళ్లలో సగం వరకు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు పోవచ్చు. అలాగే, AI కు గాడ్‌ఫాదర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ హింటన్ కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే Nvidia CEO జెన్సన్ హవాంగ్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది AI కొన్ని ఉద్యోగాలను తొలగించవచ్చని ఆయన అంగీకరించినా, అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా రావచ్చని చెప్పారు.
పెర్ప్లెక్సిటీ AI అనే సర్చ్ ఇంజిన్, మనిషి మాట్లాడే విధంగా సమాధానాలు ఇచ్చే శైలితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ టైమ్‌లోనే ఇది చాలా మందికి ఉపయోగపడే AI టూల్‌గా మారింది. ఇప్పుడు ఈ కంపెనీ 'కామెట్' అనే కొత్త బ్రౌజర్‌ను కూడా ప్రారంభించింది. పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ద్వారా యూజర్లు GPT-4o, Claude 4.0 Sonnet, జెమిని వంటి అత్యాధునిక భాషా మోడల్స్‌కి యాక్సెస్ పొందొచ్చు. అంతేకాదు, భారతి ఎయిర్‌టెల్ తాజాగా తమ ఎంపికైన కస్టమర్లకు ఒక సంవత్సరం ఉచితంగా ఈ ప్రో సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
యువత తమ భవిష్యత్తు కోసం సామాజిక మాధ్యమాల్లో కాలం వృథా చేయకుండా, AI టూల్స్‌ను నేర్చుకుని, వాటిని తమ కెరీర్‌లో వినియోగించుకోవడమే అత్యవసరమని అరవింద్ శ్రీనివాస్ వెల్లడించారు.
More From GoodReturns

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications