మ్యాగీ అంటుంది ఇప్పుడు మోర్ మని... ఇన్స్టంట్ ఫుడ్ ధరపై కీలక నిర్ణయం..
అర్థరాత్రి ఆకలేస్తుందా, వంట చేయాలని అనిపించడం లేదా బయటి నుంచి ఆర్డర్ చెదామంటే టైం పడుతుందా... అంతెందుకు ఈ చలికాలంలో ఏదైనా వేడిగా తినాలని ఉందా ఇన్స్టంట్ గా అన్నిటికి ఒకటే సొల్యూషన్ చిటికలో రెడీ అయిపోయే అందరి ఫెవరెట్ మ్యాగీ ఎవరికైనా ఫస్ట్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మీ మ్యాగీ మరింత కాస్ట్లీ కానుంది.
భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో మ్యాగీని ఇష్టపడతారు. రెండు నిమిషాల్లో తయారయ్యే ఈ నూడుల్స్ ఇప్పుడు ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ముఖ్యంగా పిల్లలు, సింగిల్స్ లైఫ్స్ లో కూడా. అతిపెద్ద విషయం ఏమిటంటే దీని వెనుక ఉన్నది భారత ప్రభుత్వం కాదు స్విస్ ప్రభుత్వ పాలన. అయితే దీని గురించి వివరంగా తెలుసుకుందాం...

మ్యాగీ ఎందుకు ఖరీదైనది?
మ్యాగీ ధర పెరగడానికి కారణం 1994లో భారతదేశం, స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ప్రకారం మోస్ట్-ఫేవర్డ్-నేషన్ (MFN) నిబంధనను సస్పెండ్ చేయడం. నిజమికి 1 జనవరి 2025 నుండి ఈ నిబంధనను తాత్కాలికంగా నిలిపివేయాలని స్విట్జర్లాండ్ నిర్ణయించింది. MFN నిబంధన ఆటోమేటిక్ గా వర్తించదని, దాని అమలు కోసం భారత ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ అవసరం అని పేర్కొన్న భారత సుప్రీంకోర్టు 2023 తీర్పును అనుసరించి ఈ చర్య తీసుకుంది.
MFN నిబంధన అంటే ఏమిటి?
MFN నిబంధన ఉద్దేశ్యం డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఉన్న దేశాలు ఒకదానికొకటి సమాన ప్రయోజనాలను అందించడం. స్విస్ కంపెనీలకు అందుబాటులో లేని స్లోవేనియా, లిథువేనియా, కొలంబియా వంటి ఇతర దేశాలతో DTAA కింద భారతదేశం మరింత అనుకూలమైన పన్ను ప్రయోజనాలను అందించిందని స్విట్జర్లాండ్ ఆరోపించింది.
స్విస్ కంపెనీలపై ప్రభావం
స్విట్జర్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయం భారత మార్కెట్‌లో అధిక వాటా ఉన్న నెస్లే వంటి కంపెనీలపై అత్యధిక ప్రభావం చూపనుంది. కొత్త నిబంధనల ప్రకారం, స్విస్ కంపెనీలు భారతీయ ఆదాయ వనరుల నుండి పొందే డివిడెండ్లపై 10% వరకు పన్ను చెల్లించాలి. ప్రస్తుతం ఈ రేటు 5%గా ఉంది.
నెస్లే అండ్ ఇతర స్విస్ కంపెనీలు స్లోవేనియా అండ్ లిథువేనియా వంటి దేశాలలాగానే 5% పన్ను రేటు ప్రయోజనాన్ని కూడా పొందాలని సుప్రీంకోర్టులో వాదించాయి. అయితే ఆ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
స్విట్జర్లాండ్ నిర్ణయం తర్వాత భారత మార్కెట్‌లో నెస్లే ఉత్పత్తులు మ్యాగీ, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం పెరిగిన పన్ను భారం, ఇది ఈ కంపెనీల ఖర్చులను పెంచుతుంది. ఇంకా వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, దింతో ఈ ఉత్పత్తులను అధిక ధరకు కొనాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications