జీవితంలో ఒకసారి వ్యాపారం దెబ్బతింటే చాలా మంది నిరాశతో కుంగిపోతారు. కానీ, పడిలేచిన కెరటమే అసలైన విజేత అని నిరూపించాడు చైనాకు చెందిన 25 ఏళ్ల యువకుడు 'జాంగ్ జుకియాంగ్'. అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితి నుండి కేవలం ఐదేళ్లలో కోటీశ్వరుడిగా ఎదిగిన అతని ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్‌స్పైరింగ్ సక్సెస్ స్టోరీ (success story) గా మారింది.
వ్యాపారంలో నష్టం.. అప్పుల సెగ
దక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన జాంగ్.. 2020లో ఎంతో ఆశతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు అది కొన్ని నెలల్లోనే మూతపడింది. నష్టంతో పాటు సుమారు రూ. 6.5 లక్షల (50 వేల యువాన్లు) అప్పు మిగిలింది. సాధారణంగా ఎవరైనా సరే ఇంత చిన్న వయసులో అంత అప్పు ఉంటే భయపడతారు. కానీ జాంగ్ మాత్రం వెనకడుగు వేయలేదు. పట్టుదలతో తను అనుకున్నది సాధించాడు.

లక్ష్యం: నెలకు రూ. 3 లక్షల సంపాదన!
అప్పు తీర్చడమే కాకుండా తిరిగి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సంపాదించాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను ఒక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. అయితే అతను మిగతా డెలివరీ బాయ్స్ లాగా కాకుండా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదించాలనే పట్టుదలతో పని మొదలుపెట్టాడు.
రికార్డ్ బ్రేకింగ్ శ్రమ: రోజుకు 14 గంటలు.. 300 పార్శిళ్లు!
జాంగ్ దినచర్య వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
- పని వేళలు: ఉదయం 11 గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు.. అంటే నిత్యం 14 గంటల పాటు రోడ్లపైనే గడిపేవాడు.
- డెలివరీ వేగం: ప్రతి ఆర్డర్‌ను 20 నుండి 25 నిమిషాల్లోనే కస్టమర్‌కు చేరవేసేవాడు. ఇలా రోజుకు సగటున 300 పార్శిళ్లను డెలివరీ చేసి కంపెనీలో రికార్డు సృష్టించాడు.
- ఏడాది పొడవునా: సంవత్సరంలో 365 రోజులు పనికే కేటాయించేవాడు. కేవలం చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సమయంలో తప్ప ఎప్పుడూ సెలవు తీసుకోలేదు.
ఐదేళ్ల ఫలితం.. కోటీశ్వరుడు!
ఈ ఐదేళ్ల కఠిన శ్రమలో జాంగ్ దాదాపు 3.24 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. లక్షన్నరకు పైగా పార్శిళ్లను కస్టమర్లకు అందించాడు. అతని స్పీడ్ చూసి తోటి ఉద్యోగులు అతనికి 'ఆర్డర్ కింగ్' అని పేరు పెట్టారు. ఐదేళ్లో అతని మొత్తం సంపాదన ఏకంగా రూ.1.80 కోట్లు. ఇందులో అతను అనవసర ఖర్చులు తగ్గించుకుని ఏకంగా రూ. 1.42 కోట్లు పొదుపు చేశాడు.
తిరిగి వ్యాపార రంగంలోకి..
తన కష్టార్జితంతో అప్పులన్నీ తీర్చేసి, ఇప్పుడు కొత్త ఏడాదిలో రూ.1 కోటి పెట్టుబడితో రెండు టిఫిన్ సెంటర్లు ప్రారంభించేందుకు జాంగ్ సిద్ధమవుతున్నాడు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా.. పని ఏదైనా సరే అంకితభావంతో చేస్తే విజయం వరిస్తుందని ఈ యువకుడి సక్సెస్ స్టోరీ (success story) నిరూపిస్తోంది.
ఇతని కథని బట్టి మనకు తెలిసిందేంటంటే.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు బాధపడటం కంటే కష్టపడే గుణం ఉంటే ఏ రంగంలోనైనా కోట్లు సంపాదించవచ్చు. దానికి జాంగ్ జీవితమే ఒక ఉదాహరణ. జాంగ్ ప్రయాణం నేటి యువతకు నిజంగా ఒక గొప్ప స్ఫూర్తి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications