Insolation Energy Share: మల్టీబ్యాగర్లు తమ రికార్డుల ర్యాలీని ఎల్లప్పుడూ చిన్న స్థాయి నుంచే ప్రారంభిస్తుంటాయి ఎక్కువ సార్లు. అయితే ఐపీవోగా మార్కెట్లోకి వచ్చిన ఏడాదిన్నరలోనే మల్టీఫోల్డ్ రిటర్న్స్ అందించి సంచలనంగా మారిపోయింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్సోలేషన్ ఎనర్జీ అనే స్మాల్ క్యాప్ కంపెనీ గురించే. ఈ చిన్న కంపెనీ సోలార్ ప్యానెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ వ్యాపారంలో ఉంది. సెప్టెంబర్ 2022లో మార్కెట్లోకి వచ్చిన స్టాక్.. కేవలం ఏడాదిన్నరలోనే పెట్టుబడిదారులను కంపెనీ ధనవంతులుగా మార్చేసింది. ఎనర్జీ స్టాక్ రూ.38.15 నుంచి.. ఏప్రిల్ 15, 2024న ఒక్కో షేర్ విలువ రూ.1,700 దాటింది. అంటే ఈ క్రమంలో స్టాక్ ఏకంగా 4400% కంటే ఎక్కువ రాబడులను తన పెట్టుబడిదారులకు అందించింది. కంపెనీ 52 వారాల గరిష్ఠ స్థాయి దర రూ.1,750గా ఉంది. అలాగే స్టాక్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.118.50గా ఉంది.

ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్ల ధర రూ.38గా ఉంది. అక్టోబర్ 10, 2022న కంపెనీ షేర్లు రూ.76.10 వద్ద లిస్ట్ చేయబడ్డాయి. ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్లు లిస్టింగ్ రోజున రూ.79.90కి చేరాయి. అప్పటి నుంచి కంపెనీ షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్లు 15 ఏప్రిల్ 2024న రూ.1,743.85కి చేరుకున్నాయి. ఇష్యూ ధర రూ.38తో పోలిస్తే కంపెనీ షేర్లు ప్రస్తుతం 4400% పైగా లాభాలను షేర్లను హోల్డ్ చేసిన పెట్టుబడిదారులకు అందించింది.
గత ఏడాది కాలంలో ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్లలో మెగా ర్యాలీ కారణంగా 1070% లాభపడ్డాయి. ఏప్రిల్ 17, 2023న కంపెనీ షేర్లు రూ.149 వద్ద నుంచి ఏడాది తిరగకుండానే నేడు రూ.1,743.85కి చేరుకున్నాయి. గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 295% పెరిగాయి. ఇన్సోలేషన్ ఎనర్జీ షేర్లు అక్టోబర్ 16, 2023న రూ.445.10 వద్ద ఉన్నాయి. 2024లో ఇప్పటి వరకు ఎనర్జీ షేర్లు 125% విపరీతమైన పెరుగుదలను చూశాయి. కంపెనీ ఐపీవో మొత్తం 192.79 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 235.55 రెట్లు సబ్‌స్కిప్షన్ పొందింది.


Click it and Unblock the Notifications