బ్యాంకింగ్ రంగంలో నమ్మకమే పెట్టుబడి. కానీ, నాగ్‌పూర్‌లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ బ్రాంచ్‌లలో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నకిలీ బంగారాన్ని (Gold) కుదువ పెట్టి ఏకంగా రూ. 23 కోట్ల మేర బ్యాంకును మోసం చేసిన వైనం బయటపడింది. అది కూడా ఏదో ఒక బ్రాంచ్‌లో కాదు.. ఏకంగా తొమ్మిది బ్రాంచ్‌లలో ఈ అక్రమాలు జరగడం గమనార్హం.

ఎలా బయటపడింది? (The Audit Reveal)
బ్యాంకులో సాధారణంగా జరిగే 'గోల్డ్ లోన్ ఆడిట్' సమయంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మనీష్ నగర్ బ్రాంచ్‌లో తనిఖీలు చేస్తున్న అధికారులకు, కొందరు కస్టమర్లు కుదువ పెట్టిన నగలు అసలైన బంగారం కాదని, కేవలం నకిలీవని తేలింది. దీంతో అనుమానం వచ్చి ఇతర బ్రాంచ్‌లలో కూడా ఆడిట్ చేయగా, మొత్తం 159 అకౌంట్లలో నకిలీ నగలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
రెండేళ్ల పక్కా ప్లాన్
ఈ మోసం జనవరి 2023 నుండి అక్టోబర్ 2025 వరకు నిరంతరాయంగా సాగింది. ఇంత పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నా ఎవరూ కనిపెట్టలేకపోయారంటే, ఇందులో లోపలి వ్యక్తుల హస్తం పక్కాగా ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా బ్యాంక్ గోల్డ్ లోన్ ఇచ్చే ముందు ఒక 'వాల్యూయర్' ఆ బంగారం నాణ్యతను తనిఖీ చేయాలి. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే లోన్ మంజూరవుతుంది. కానీ ఇక్కడ వాల్యూయర్లు, ఆడిటర్లు , బ్యాంకు అధికారులందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
నిందితులెవరు? (The Syndicate)
ధంటోలి పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం.. సచిన్ రౌత్ అనే అకౌంట్ హోల్డర్, నందు ఖర్వాడే అనే వాల్యూయర్, రాజేంద్ర శిలంకర్ వంటి ఆడిటర్లతో పాటు బ్రాంచ్ మేనేజర్ పంకజ్ కేకత్పురే కూడా ఈ కుట్రలో భాగస్వామ్యులై ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరంతా కలిసి నకిలీ నగలను అసలైన బంగారంగా సర్టిఫై చేసి బ్యాంకుకు భారీ నష్టాన్ని చేకూర్చారు.
చట్టపరమైన చర్యలు
బ్యాంక్ జోనల్ హెడ్ ధనంజయ్ రమేష్ థిటే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 420 (చీటింగ్), 406 (నమ్మక ద్రోహం), 120(B) (నేరపూరిత కుట్ర) వంటి కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. బ్యాంకు లోపల ఉన్న ఇతర అధికారుల పాత్రపై కూడా లోతైన విచారణ జరుగుతోంది.
సాధారణ ప్రజలు బంగారం (Gold) కుదువ పెట్టి లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు ఎన్నో నిబంధనలు పెడతాయి. కానీ, ఇలాంటి భారీ స్కామ్‌లు జరిగినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలోని భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. గోల్డ్ లోన్ తీసుకునే వారు , బ్యాంక్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.


Click it and Unblock the Notifications