IPO News: ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ప్రకటించిన ఐపీవో.. డిసెంబర్ 14న ప్రారంభం..

Inox India IPO: 2023 చివరి నెల డిసెంబరులో వరుసగా మార్కెట్లోకి ఐపీవోలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రద్దీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు సైతం ఏడాదిని లాభాలతో ముగించేందుకు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా ఐనాక్స్ ఇండియా కంపెనీ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొస్తోంది. వాస్తవానికి ఈ కంపెనీ క్రయోజనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,459.32 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.627-660గా ప్రకటించింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం దీనిని డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు.

Inox India released ipo price band as 627 to 660 opening on december 14th

ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో నిర్వహించబడుతోంది. ఈ క్రమంలో కంపెనీ మెుత్తంగా 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ 13న తెరవబడుతోంది. కంపెనీ ప్రమోటర్లు సిద్ధార్థ్ జైన్, పవన్ కుమార్ జైన్, నయనతార జైన్, ఇషితా జైన్ తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తమ వాటాలను విక్రయిస్తున్నారు. వీరితో పాటు మంజు జైన్, లతా రుంగ్తా, భారతీ షా, కుముద్ గంగ్వాల్, సుమన్ అజ్మీరా, రజనీ మొహట్టా కూడా OFSలో తమ వాటాలను ఆఫ్‌లోడ్ చేస్తారు.

ఐపీవో ద్వారా సేకరించబడిన మెుత్తం సొమ్ము కేవలం వాటాలు అమ్మిన ప్రమోటర్లకు మాత్రమే చేరుకుంటుంది. అంటే ఈ ఐపీవో ద్వారా వచ్చే డబ్బు కంపెనీకి అస్సలు చేరుకోదని తెలుస్తోంది. క్రయోజెనిక్ పరికరాలను తయారు చేసే ఐనాక్స్ ఇండియా.. డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, క్రయోజెనిక్ సొల్యూషన్‌ల కోసం పరికరాలు, సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్ పరిష్కారాలను అందిస్తోంది.

ఐపీవో లాట్ పరిమాణాన్ని 22 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది.. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ పాల్గొనాలంటే కనీసం రూ.14,520 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ మార్చి FY23తో ముగిసిన సంవత్సరానికి నికర లాభంలో 17 శాతం వృద్ధిని రూ.152.7 కోట్లకు నమోదు చేసింది. అదే కాలంలో ఆదాయం 23.4 శాతం పెరిగి రూ.966 కోట్లకు చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+