IPO News: దంచికొట్టిన ఐపీవో.. ప్రీమియం లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లపై లాభాల తుఫాను..
INOX India IPO: ఈరోజు దేశీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లోకి వచ్చిన ఐపీవో మాత్రం లాభాల పంట పడించింది. ఇన్వెస్టర్లకు గడ్డు సమయంలో కూడా సూపర్ రిటర్న్స్ అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది క్రయోజెనిక్ ట్యాంక్ తయారీ కంపెనీ INOX ఇండియా లిమిటెడ్ ఐపీవో గురించే. ఐపీవో నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో దాదాపు 44 శాతం ప్రీమియం ధర వద్ద జాబితా చేయబడింది. షేర్లు బీఎస్ఈలో 42 శాతం రూ.933.15 రేటు వద్ద లిస్టింగ్ కాగా.. ఎన్ఎస్ఈలో 43.89 శాతం ప్రీమియం రేటు రూ.949.65 వద్ద అడుగుపెట్టింది. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధర 627-660గా నిర్ణయించింది.

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 14న తెరచుకోగా డిసెంబర్ 18న ముగిసింది. ఇష్యూ ముగింపు రోజున ఐపీవో 61.28 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. NSE డేటా ప్రకారం కంపెనీ ఇష్యూ చేసిన 1,54,77,670 షేర్లకు వ్యతిరేకంగా 94,84,24,268 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా 147.80 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 50.20 రెట్లు, రిటైలర్ల పోర్షన్ 15.29 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
నేడు జాబితా చేయబడిన ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.438 కోట్లను సమీకరించింది. కంపెనీ ప్రస్తుతం పూర్తిగా షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,459.32 కోట్లను సమీకరించింది. కంపెనీ దేశంలో అతిపెద్ద పారిశ్రామిక, వైద్య ఆక్సిజన్ తయారీదారుగా ఐనాక్స్ ఇండియా కొనసాగుతోంది. ఐనాక్స్ గ్రూప్ కింద కంపెనీ వివిధ వ్యాపారాల్లోకి విస్తరించి ఉంది.
ఐపీవో లాట్ పరిమాణాన్ని 22 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఇన్వెస్టర్ పాల్గొనాలంటే కనీసం రూ.14,520 పెట్టుబడిగా పెట్టారు. కంపెనీ మార్చి FY23తో ముగిసిన సంవత్సరానికి నికర లాభంలో 17 శాతం వృద్ధిని రూ.152.7 కోట్లకు నమోదు చేసింది. అదే కాలంలో ఆదాయం 23.4 శాతం పెరిగి రూ.966 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications