అమెరికా - చైనా తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అగ్రరాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత ఏడాదికాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ రెండు దేశాల ట్రేడ్ వార్ కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ట్రేడ్ వార్‌పై సానుకూల సంకేతాలు లేనప్పుడల్లా మార్కెట్లు నష్టపోతున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలి ఒప్పందం కుదిరింది. చైనా ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలకు సంబంధించి మేథో హక్కుల పరిరక్షణ, సాంకేతిక బదలీ, వ్యవసాయం, ఆర్థిక సేవలు, కరెన్సీ, విదేశీ మారకద్రవ్య విధానాల్లో వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టవలసి ఉంది.
వచ్చే ఏడాది నుంచి అమెరికా నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనం, తయారీ వస్తువులు కొనుగోలు చేసేందుకు చైనా కట్టుబడి ఉండాలి. కచ్చితంగా, సమర్థంగా వివాదాలు పరిష్కారమయ్యేలా చూసేందుకు వివాద పరిష్కార పటిష్ట వ్యవస్థ ఏర్పాటు అవుతోంది. వాణిజ్య ఒప్పంద తొలి దశలో కీలక గమ్యం చేరినట్లుగా చైనా మంత్రి వాంగ్ షూవెన్ అన్నారు.

తొలి వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇటీవల విధించిన సుంకాలను సవరించేందుకు అమెరికా అంగీకరించినట్లు చైనా తెలిపింది. 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకం కొనసాగుతుందని, మరో 120 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 7.5 శాతం సుంకం అమలవుతుందని డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. అయితే డిసెంబర్ న విధించనున్నట్లు ప్రకటించిన సుంకాన్ని ఉపసంహరించకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications