Infosys Salary Hikes: దేశంలోని టాప్ 2వ ఐటీ సేవల కంపెనీగా గుర్తింపు పొందిన సంస్థ ఇన్ఫోసిస్. కంపెనీ ఇటీవలి కాలంలో తన ఉద్యోగులకు వేతన పెంపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంతో పోల్చితే ఈ సారి తక్కువగా వేతన పెంపులను అందించటంపై ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు.
వాస్తవానికి కంపెనీ గత ఏడాది కంటే వేతన పెంపును 5-10 శాతం మధ్యతో తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈసారి ఉద్యోగులు సగటున 5-8 శాతం మాత్రమే వేతన పెంపులను అందుకున్నట్లు వెల్లడైంది. దీనికి తోడు కంపెనీ ఇటీవల తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెర్పామెన్స్ బోనస్ విషయంలో సైతం ఇలాగే కోతలు విధించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పద్ధతి ఉద్యోగులు నిజాయితీగా పొందాల్సిన సాని కంటే తక్కువ అందిస్తోందనే వాదన కూడా ఉంది.

కంపెనీ ఆదాయాలు, లాభాలు గతంలో కంటే పెరిగినప్పటికీ కంపెనీ ఉద్యోగులకు ఆ స్థాయిలో బెనిఫిట్స్ అందించటం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ రోలవుట్ చేసిన పే హైక్స్ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందని వారు చెబుతున్నారు. వాస్తవానికి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కంపెనీ నుంచి మంచి వేతన పెంపులను ఆశించినప్పటికీ వాస్తవరూపంలో అది కనిపించలేదని వారు చెబుతున్నారు. అలాగే కంపెనీ గతంలో ప్రకటించిన పెర్ఫామెన్స్ బోనస్ తగ్గింపులలో మిగుల్చుకున్న డబ్బును ప్రస్తుతం హైక్స్ నిధులను సమకూర్చటానికి చేసిన పనిగా గతంలో నిపుణులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతన పెంపులను అందించే క్రమంలో వారిని నాలుగు వర్గాల కిందకు విభజించింది. ఈ క్రమంలో అంచనాలను అందుకున్న వారికి 5-7 శాతం, ప్రశంసనీయమైన పనితీరు చూపిన వారికి 7-10 శాతం, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వ్యక్తులకు 10-20 శాతం వేతన పెంపులను అందించింది. ఇక చివరిగా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వేతన పెంపును అందించటం లేదని స్పష్టం చేసింది.
కంపెనీలలో అత్యుత్తమ ప్రదర్శనకారులకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం అయినప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులకు తగిన పరిహారం లభిస్తుందా లేదా అనేది ఆందోళన కలిగిస్తుంది. చాలామంది తమ ప్రయత్నాలను సరిగ్గా గుర్తించడం లేదని భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ 2022లో జీతాల పెంపును నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే 2023 అక్టోబర్‌లో ఈ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసింది. ఇప్పుడు తక్కువ పెంపులు, తగ్గిన పనితీరు బోనస్‌లతో కంపెనీ ఉద్యోగులకు ఉదారంగా బహుమతులు ఇవ్వడం కంటే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ కంపెనీ ఈ విధానంపై ఉద్యోగులు మాత్రం నిరాశను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications