ఓ పిల్లాడు 18 నెలలకే కోటీశ్వరుడు అయ్యాడు.. ఏంటీ 18 నెలల పసిబాలుడు కోటీశ్వరుడు అవడం ఏంటి అని అనుకుంటున్నారా.. అవును పచ్చి నిజం..18 నెలల వయసుకే అతను కంపెనీ నుండి తన వాటాగా 6.5 కోట్ల డివిడెండ్ అందుకున్నాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు..ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు.. తన తాత నాలుగు నెలల పసిప్రాయంలో ఇచ్చిన దాదాపు రూ. 2.40 కోట్ల విలువైన షేర్ల ద్వారా ఆ పిల్లాడు ఇప్పుడు ఏకండా 6.5 కోట్లకు అధిపతి అయ్యాడు.
కథనంలోకి వెళ్తే.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ రోహన్ మూర్తి నాలుగు నెలల వయసులో ఉన్నప్పుడు తన తాత నారాయణ మూర్తి రూ. 2.40 కోట్ల విలువైన షేర్లను రోహన్ మూర్తికి బహుమతి కింద అందించాడు. ఆ షేర్లు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. రోహన్ 14 నెలలు వయసు వచ్చేసరికి అవి రెట్టింపు అయి ఇప్పుడు రూ. 6.5 కోట్లకు చేరుకున్నాయి.

రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ కుమారుడైన ఏకాగ్ర..2023లో దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజంలో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీలో 0.04 శాతం వాటాను పొందిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించాడు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ డివిడెండ్ చెల్లింపు ఒక్కో షేరుకు రూ.43గా ఉంది. ఈ లెక్కన నారాయణ మూర్తి మనవడు తన 15 లక్షల షేర్లపై రూ. 6.5 కోట్లు కూడగట్టాడు. ఇన్పోసిస్ లో మొత్తం 54.2 కోట్ల షేర్లను వాటాదారులు కలిగి ఉన్నారు. వీటి విలువ దాదాపు రూ.2,330 కోట్లు పై మాటే..
కంపెనీ నివేదిక ప్రకారం..ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని తన 4 కోట్ల షేర్ల నుండి రూ.175 కోట్లను డివిడెండ్ రూపంలో పొందారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 1.5 కోట్ల షేర్ల నుండి రూ.65 కోట్ల డివిడెండ్ పొందారు. మరో సహ వ్యవస్థాపకుడు గోపాలకృష్ణన్ రూ.3.2 కోట్ల షేర్ల నుండి రూ.137 కోట్ల డివిడెండ్ రూపంలో పొందాడు. ఇక ఆయన భార్య సుధా గోపాలకృష్ణన్ 9.5 కోట్ల షేర్ల ద్వారా రూ.410 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. కంపెనీలో ఈమె అత్యధిక షేర్లను కలిగి ఉంది.
ఇక నారాయణ మూర్తి మనవడు రోహన్ మూర్తి తన 6 కోట్ల షేర్ల నుండి రూ. 261.5 కోట్ల డివిడెండ్ రూపంలో అందుకోగా..మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షత మూర్తి తన 3.8 కోట్ల షేర్ల నుండి రూ. 167 కోట్లు డివిడెండ్ రూపంలో అందుకున్నారు. ఇక నికితా, మిలన్ శిబులాల్ మంచందాలు ఒక్కొక్కరు 61 లక్షల షేర్లతో రూ. 26.3 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. మరో వాటాదారు తనుష్ నీలేకని చంద్ర 33.5 లక్షల షేర్లతో రూ. 14 కోట్లు డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని ఆర్జించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications