Infosys Hiring News: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ 12 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించి టెక్ రంగంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి విదితమే. ఈ ఉద్యోగ తొలగింపుల నిర్ణయం ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లోని ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని టీసీఎస్ కంపెనీ పేర్కొంది.ఐటీ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయని.. కృత్రిమ మేధ, ఆపరేటింగ్ మోడల్ మార్పులు ఇలా కొత్త సాంకేతికత పుట్టుకొచ్చిందని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎవరైనా నడుచుకోవాలని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే.కృతివాసన్ తెలిపారు.
అయితే ఈ సమయంలో ఇన్ఫోసిస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. AI & రీస్కిల్లింగ్‌పై దృష్టి పెడుతున్నామని ఇందులో భాగంగానే భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు.

సీఈఓ మాట్లాడుతూ.. మేము మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం. మొత్తం సంవత్సరానికి 20 వేల మంది కళాశాల విద్యార్థులను నియమించుకోవాలని భావిస్తున్నామని పరేఖ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో అస్థిరత ఉన్న సమయంలో ఈ ప్రకటన యువతకు కొత్త ఆశలు కలిగిస్తోంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ తన వ్యూహాత్మక దృష్టిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రీస్కిల్లింగ్ పై కేంద్రీకరించింది. ఇప్పటివరకు సంస్థ 2.75 లక్షల మంది ఉద్యోగులకు రీస్కిల్లింగ్ శిక్షణ అందించిందని సీఈఓ తెలిపారు. AI వల్ల ఆటోమేషన్ డెవలప్ అవుతుందని తెలిపిన ఆయన..ఉన్నత స్థాయి నైపుణ్యాల అవసరం కూడా పెరుగుతుందని అన్నారు.
TCS 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన తరుణంలో ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. టీసీఎస్ 12 వేల ఉద్యోగాలతో ఐటీ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఉద్యోగ కోతలు జరిపిన దాఖలాలు లేవని టెక్ నిపుణులు చెబుతున్నారు.నాస్కామ్ తాజా ప్రకటన ప్రకారం.. ఐటీ రంగం సమీప భవిష్యత్తులో అనేక ఒడిదుడుకులకు లోనవుతుందని స్పష్టం చేసింది. ఆటోమేషన్, గ్లోబల్ క్లయింట్ల డిమాండ్ పెరుగుదల, వేగవంతమైన డెలివరీ మోడళ్లవైపు మొగ్గు తదితర అంశాలు ఉద్యోగ తొలగింపుల ప్రధాన కారణాలుగా తేల్చింది.
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. AI ఆధారిత ఆటోమేషన్ వల్ల కోడింగ్ లో 5 శాతం నుండి 15 శాతం వరకు ఉత్పాదకత పెరుగుతోందని పరేఖ్ తెలిపారు. ఉద్యోగుల పర్యవేక్షణతో కూడిన ఆటోమేషన్ వల్ల దాదాపు 20 శాతం ఉత్పాదకత మెరుగుదల సాధ్యమవుతుందని తెలిపింది. ఇక వేతనాలపై ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Q4, Q1 లో వేతనాల పెంపు ప్రక్రియ పూర్తయిందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం తదుపరి పెంపు చక్రాన్ని ప్రారంభించే సమయం పై పరిశీలన జరుగుతోందని అన్నారు. సంస్థ తగిన సమయంలో ఈ విషయం ప్రకటించనుందని స్పష్టం చేశారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications