For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు స్టార్ట్! 14న బైబ్యాక్‌పై ఇన్ఫీ నిర్ణయం

|

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను ఈ నెల 14వ తేదీన పరిశీలించనుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఈ నెల 13, 14తేదీల్లో సమావేశం కానుంది. ఇందులో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించడంతో పాటు ఏకీకృత ఆర్థిక ఫలితాలను ఆమోదించనున్నట్లు ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. 2019 ఆగస్ట్ నెలలో కంపెనీ రూ.8,260 కోట్లతో 11.05 కోట్ల షేర్లకు బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

సెబీ (బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్) నిబంధ‌న‌లు-2018కి అనుగుణంగా షేర్ల బైబ్యాక్‌కు వెళ్ల‌నున్న‌ట్లు రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫుల్లీ పెయిడ్ప్ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు వెళ్తామని పేర్కొంటూ గ‌తనెల 15న రెగ్యులేట‌రీ సంస్థ‌ల‌కు నోటీసు ఇచ్చినట్లు తెలిపింది.

Infosys to consider share buyback on 14 April

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసిక ఫలితాలను ఏప్రిల్ 14వ తేదీన వెల్లడిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. గతవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.23,625 కోట్లు పెరిగి రూ.6,13,854 కోట్లకు చేరుకుంది. గత వారం ఇన్ఫోసిస్ షేర్లు 0.066 శాతం పెరిగి రూ.1440.75 వద్ద స్థిరపడింది. ఏడాది కాలంలో 141 శాతం ఎగిసింది. నేడు టీసీఎస్, 14న ఇన్ఫోసిస్, 15న విప్రో ఫలితాలు ప్రకటించనుంది.

English summary

ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు స్టార్ట్! 14న బైబ్యాక్‌పై ఇన్ఫీ నిర్ణయం | Infosys to consider share buyback on 14 April

IT services major Infosys on Sunday said that its Board will consider proposal for buyback of fully paid-up equity shares of the company at its meeting to be held on April 14, 2021.
Story first published: Monday, April 12, 2021, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X