ఇండియన్ సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ చెక్ రిబబ్లిక్‌కు చెందిన కన్సల్టెన్సీ కంపెనీ గైడ్ విజన్‌ను కొనుగలు చేయనుంది. 30 మిలియన్ యూరోలకు (రూ.260 కోట్లకు పైగా) మొత్తంతో దీనిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ కంపెనీ ఈ స్వాధీనం చేపడుతుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావొచ్చునని వెల్లడించింది.
ఐటీ ప్రాసెస్‌తో పాటు సంక్లిష్ట వ్యాపార వ్యవహారాల్ని సరళతరం చేసే సర్వీస్ నౌ టూల్, స్నోవిజన్ గైడ్‌విజన్‌కు ఉన్నాయి. గైడ్ విజన్ వందకు పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. డిజిటల్ వర్క్ నిర్వహించే కంపెనీలకు సాయం చేసే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని అభివృద్ధి చేస్తుంది సర్వీసెస్ నౌ. క్లౌడ్ ఆధారిత సేవలకు మారే సంస్థలకు ఇన్ఫోసిస్ అందిస్తోన్న కోబాల్ట్ సేవల బలోపేతానికి గైడ్ విజన్ స్వాధీనత మరింత ఉపకరిస్తుందని ఇన్ఫోసిస్ క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రావు తెలిపారు.

గైడ్ విజన్‌ను ఇన్ఫోసిస్ కొనుగోలు చేస్తుందనే ప్రకటన నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు రెండు రోజులుగా ఎగిసిపడుతున్నాయి. నిన్న ఐటీ దిగ్గజాల షేర్లు అన్నీ దూసుకెళ్లాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 9.89 శాతం ఎగిసి రూ.793 వద్ద, విప్రో షేర్ ధర 4.36 శాతం ఎగిసి రూ.306 వద్ద, టీసీఎస్ షేర్ ధర 4.67 శాతం ఎగిసి రూ.2,485 వద్ద, టెక్ మహీంద్రా షేర్ ధర 3.25 శాతం ఎగిసి రూ.790 వద్ద క్లోజ్ అయింది. అలాగే ఇన్ఫోసిస్ షేర్ ధర 3.10 శాతం ఎగిసి రూ.975 వద్ద క్లోజ్ అయింది. అయితే ఈ రోజు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ప్రారంభంలో నష్టాల్లో ఉండగా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications