Infosys News: దేశంలోని రెండవ అగ్రగామి టెక్ కంపెనీల్లో ఒకటి ఇన్ఫోసిస్. ఇందులో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు కంపెనీ చెప్పిన మాట నిలబెట్టుకుంటుందా.. లేదా అనే ఆందోళనలో ఉన్నారు.
ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 29 నుంచి 'పెర్ఫార్మెన్స్ రివ్యూ సైకిల్ అక్టోబర్ 2023'ని ప్రారంభించబోతోంది. కంపెనీ మేనేజర్‌లకు అంతర్గతంగా పంపిన ఈ-మెయిల్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల పనితీరును రేపటి నుంచి లెక్కించనున్నారు. దీనికి సంబంధించిన రేటింగ్‌లు డిసెంబర్ మొదటి వారంలోపు వ్యక్తిగత ఉద్యోగులకు తెలియజేయబడతాయి. అయితే గడచిన త్రైమాసికానికి సంబంధించిన జీతాల పెంపులు ఇంకా చెల్లించలేదని కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్ కి వెల్లడించారు.

సెప్టెంబరుతో రెండవ త్రైమాసికం ముగుస్తూ కొత్త అప్రైజల్ సైకిల్ మెుదలవుతున్నప్పటికీ టెక్ దిగ్గజం గతంలో ఇవ్వాల్సిన హైక్స్, ఇంక్రిమెంట్లను చెల్లించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు టెక్కీలు జీతం పెంపును పొందలేదు.ఇది కాకుండా పెండింగ్‌లో ఉన్న పెంపు నుంచి వచ్చే డబ్బు రాబోయే ఇంక్రిమెంట్ సైకిల్‌తో కలుపబడుతుందా లేదా వదిలివేయబడుతుందా అనే దానిపై కూడా ఉద్యోగులకు స్పష్టత లేదు.
సాధారణంగా జూన్-జూలై నెలల్లో కంపెనీలు పనితీరు ఆధారంగా పెంచిన జీతాలను ఉద్యోగులకు అందిస్తుంటాయి. అయితే ఒక ఉద్యోగి వెల్లడించిన సమాచాం ప్రకారం.. సెల్ఫ్ అచీవ్మెంట్స్, పర్ఫామెన్స్ త్వరలో అందించాల్సి ఉందని తెలిపారు. గత ఏడాది కూడా ఈ ప్రక్రియ జరిగిందని, రేటింగ్స్ కూడా ఇచ్చారని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన పెంచిన జీతాలు ఇప్పటి వరకు అందలేదని వెల్లడించాడు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతనాల పెంపును పరిశీలిస్తున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ తెలిపారు. వ్యాపార అనిశ్చితులు, సవాళ్లు కొనసాగుతున్న వేళ మరికొన్నాళ్లు ఐటీ పరిశ్రమ ఒడిదొడుకుల్లో ఉంటుందని అన్నారు. కంపెనీల ఆదాయాలు, వ్యాపార మార్జిన్లు సైతం భారీగా ప్రభావితం కావటంతో వేతనాల పెంపులను కంపెనీలు తాత్కాలికంగా వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసారైనా ఇచ్చిన మాట కంపెనీలు నిలబెట్టుకుంటుంతో లేదో చూడాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications