Infosys Shares: కుప్పకూలిన ఇన్ఫోసిస్ స్టాక్.. రూ.57,000 కోట్లు గల్లంతు.. ఎందుకంటే..
Infosys Shares: మార్కెట్ వాటా పరంగా దేశంలో రెండవ అతిపెద్ద టెక్ సంస్థ ఇన్ఫోసిస్. తాజాగా ఈ సంస్థ తన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ క్రమంలో కంపెనీ తన FY24 ఆదాయ మార్గదర్శకాలను సగానికి తగ్గించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో పెద్దఎత్తున అమ్మకాల ఒత్తిడి షేర్లలో నెలకొంది. ప్రారంభ గంటలో ఇన్ఫోసిస్ షేర్ ధర BSEలో 9.5% మేర క్షీణించింది. ఇదే క్రమంలో వాల్ స్ట్రీట్‌లో ఇన్ఫోసిస్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ADR) మూడు నెలల్లో అతిపెద్ద సింగిల్-డే పతనాన్ని నమోదు చేశాయి.

ఉదయం 10.37 గంటల సమయంలో ఇన్ఫోసిస్ స్టాక్ బీఎస్ఈలో స్టాక్ 7.78 శాతం అంటే రూ.112.60 క్షీణించి రూ.1,336.25 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇంట్రాడేలో స్టాక్ కనిష్ఠంగా రూ.1,311.60ని చేరుకుంది. నేడు ప్రారంభ డీల్స్‌లో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.56,943.2 కోట్ల మేర ఆవిరైంది. అంతకుముందు సెషన్ రూ.6,01,300.62 కోట్లతో పోలిస్తే ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి మార్కెట్ క్యాప్ రూ.5,44,357.45 కోట్లుగా నమోదైంది.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.5,945 కోట్లుగా నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 10.9% వృద్ధిని నమోదు చేసింది. అయితే QoQ ప్రాతిపధికన 3% క్షీణతను నమోదు చేసింది. అలాగే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం Q1లో రూ.37,933 కోట్లుగా నిలిచింది. ఇన్ఫోసిస్ Q1 రాబడి అంచనాలకు అనుగుణంగా ఉంది కానీ నికర ఆదాయం మిస్ అయింది.


Click it and Unblock the Notifications