Bonus Multibagger: సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి. వీటిలో ఎక్కువ బ్లూ చిప్ స్టాక్స్ గా పరిగణిస్తుంటారు. ఇవి తమ ఇన్వెస్టర్లకు లాభాలను ఇవ్వటం మాత్రమే కాకుండా.. బోనస్ షేర్లను అందించాయి. అయితే ఈ దిగ్గజ ఐటీ కంపెనీ మాత్రం ఏకంగా ఇప్పటి వరకు 5 సార్లు బోనస్ షేర్ ఇష్యూ చేసింది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ స్టాక్ గురించే. ఇది ఇన్వెస్టర్ల సంపదను పెంచటంతో పాటు బోనస్ షేర్లు, డివిడెండ్ రూపంలో కూడా భారీగా ఆదాయాన్ని అందించింది. దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడులను కొనసాగించిన వారు భారీగా లాభాలను పొందారు. 2000 సంవత్సరం నుంచి ఐటీ దిగ్గజం ఇప్పటి వరకు ఐదు సార్లు బోనస్ షేర్లను జారీ చేసింది.

ఉచిత షేర్లు అందించిన ఇన్ఫోసిస్..
2000 సంవత్సరం నుంచి ఇన్ఫోసిస్ 5 సందర్భాల్లో బోనస్ షేర్లను ప్రకటించింది. కంపెనీ 2004లో 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి మూడు షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఒక షేరు బోనస్ రూపంలో ఉచితంగా కంపెనీ అందించింది. మిగిలిన 4 సందర్భాల్లో కంపెనీ 1:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది. చివరిసారిగా ఇన్ఫోసిస్ షేర్ల ట్రేడ్ ఎక్స్-బోనస్ సెప్టెంబర్ 2018లో జరిగింది.

షేర్ ధర చరిత్ర..
ఇన్ఫోసిస్ షేర్ ధర చరిత్రను గమనించినట్లయితే.. 2000 సంవత్సరం ప్రారంభంలో స్టాక్ ధర రూ.102 వద్ద ఉంది. పొందిన బోనస్ షేర్లను పరిగణలోకి తీసుకుంటే.. పెట్టుబడిదారులకు వాస్తవ ధర ఒక్కో షేరుకు రూ.1.59375గా ఉండేది.

లక్షను కోట్లుగా మార్చిన వైనం..
ఎవరైనా దీర్ఘకాలం కోసం ఈ స్టాక్ లో 2000 సంవత్సరంలో ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.9.58 కోట్లుగా ఉండేది. ఈ రోజు స్టాక్ మార్కెట్లో దాదాపు 4.15 శాతం నష్టపోయిన తరువాత రూ.1,458 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,953.90 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.1,367.15గా ఉంది.


Click it and Unblock the Notifications