Infosys Share: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈరోజుతో ఎక్స్ డివిడెండ్ కానుంది. దీంతో మార్కెట్లో కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి అందిన వివరాలతో అక్షత మూర్తి ఎలా లాభపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెలువరించిన ఇన్ఫోసిస్ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.17.50 ఫైనల్ డివిడెండ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అర్హత కలిగిన వాటాదారులకు కంపెనీ బోర్డు జూన్ 2, 2023ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. షేర్ హోల్డర్ల ఖాతాల్లో జూలై 3, 2023న డివిడెండ్ జమ అవుతుంది.

కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం బ్రిటన్ ప్రధాని భార్యగా ఉన్న అక్షతా మూర్తికి భారీ మెుత్తాన్ని అందించనుంది. రికార్డ్ తేదీలో కంపెనీ షేర్లను కలిగి ఉన్నవారు లిస్టెడ్ ఎంటిటీ ప్రకటించిన డివిడెండ్ చెల్లింపుకు అర్హులు. అందువల్ల కంపెనీలో 1.07 శాతం వాటాలను కలిగి ఉన్న అక్షతా మూర్తి వద్ద 3,89,57,096 ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి. ఇవి ఆమెకు దాదాపు రూ.68,17,49,180 లేదా రూ.68 కోట్లను డివిడెండ్ ఆదాయంగా పొందనున్నారు.
FY23లో ఇన్ఫోసిస్ మెుత్తంగా ఒక్కో షేరుకు రూ.34 డివిడెండ్ చెల్లించింది. ఈక్రమంలో తన ఇన్వెస్టర్లకు రూ.14,200 కోట్లను ఆదాయంగా అందించింది. మధ్యాహ్నం 12.26 గంటల సమయంలో ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1,304.25గా ఉంది. ఈ క్రమంలో షఏర్ ఇంట్రాడేలో 1.15 శాతం క్షీణించి రూ.15.20 మేర తగ్గింది.


Click it and Unblock the Notifications