Infosys Share: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, ఆర్ధిక పరిస్థితులు ఎవ్వరూ ఊహించని స్థాయిలో దిగజారాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపార వాతావణంలో కంపెనీల విలీనాలు, అక్వజిషన్ల గురించి మాట్లాడారు. తమ దగ్గర మంచి డేటా కూడా ఉందని అన్నారు.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ మంచి కొనుగోళ్ల కోసం "అన్ని వేళలా చూడటం"లో ఉందని.. దీనికి సరైన వ్యాపార వాతావరణం ప్రస్తుతం ఉందంటూ పరేఖ్ అన్నారు. ప్రస్తుతం కంపెనీ బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగి ఉందని స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా, సాంస్కృతికంగా కూడా సరిపోయే కంపెనీ లేదా ఎంటిటీని కనుగొంటే దానిని కొనుగోలు చేసే మార్గాన్ని పరిశీలిస్తామంటూ వెల్లడించారు.

ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చేసిన ఈ వ్యాఖ్యలతో నేడు మార్కెట్ల ప్రారంభం నుంచి షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత గందరగోళ ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్న వేళ చేసిన వ్యాఖ్యలు షేర్లపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో అమ్మకాల విధ్వంసాన్ని సృష్టించిన ఇన్ఫోసిస్ స్టాక్ ఏకంగా 12 శాతం వరకు కుప్పకూలింది. వేలకోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

అమెరికాలో బలహీనమైన స్థూల ఆర్థిక వాతావరణం, ప్రపంచ అస్థిరత విలీనాలు కొనుగోళ్లకు లాభదాయకమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయా అనే ప్రశ్నకు పరేఖ్ బదులిస్తూ పై కామెంట్స్ చేశారు. దీనికి ముందు గతవారాంతంలో ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అయితే ఊహించిన దానికంటే తక్కువ లాభాలను నివేదించటంతో మార్కెట్ వర్గాలు నిరాశకు గురయ్యాయి. దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 7.8 శాతం పెరిగి రూ.6,128 కోట్లకు చేరుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే లాభం ఏడు శాతం క్షీణించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications