ముంబై: నిఫ్టీ ఐటీ దూకుడుతో నిన్న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కొన్ని స్టాక్స్ 52 వారాల గరిష్టాలను తాకుతున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ ఇటీవల భారీగా ఎగిసిపడింది. నెల రోజుల్లో రూ.1350 నుండి 1560కి వచ్చింది. ఈ వారం సెషన్లలో రూ.1500 నుండి రూ.1560కి వచ్చింది. ఇన్ఫోసిస్ బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో ఈ షేర్ పరుగులు పెడుతోంది. అలాగే, కరోనా సమయంలో మంచి వృద్ధిని నమోదు చేసిన రంగాల్లో ఐటీ రంగం మాత్రమే ఉంది. దీంతో ఈ స్టాక్స్ అదరొడుతున్నాయి.

నేటి నుండి బైబ్యాక్
నేటి (25 శుక్రవారం) రూ.9,200 కోట్ల విలువైన బైబ్యాక్ ప్రక్రియను ప్రారంభిస్తోంది ఇన్ఫోసిస్. ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీతో బైబ్యాక్ ఆఫర్ ముగుస్తుంది. బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌కు గరిష్ఠంగా రూ.1,750 చెల్లించనుంది ఇన్ఫోసిస్. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నెల 19వ తేదీన జరిగిన కంపెనీ 40వ వార్షిక సభ్యసమావేశంలో వాటాదారుల నుండి అంగీకారం వచ్చింది.

5 లక్షలకు పైగా షేర్ల బైబ్యాక్
బైబ్యాక్‌లో గరిష్టంగా 5,25,71,428 షేర్లను బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేయనుంది ఇన్ఫోసిస్. గత అయిదేళ్లలో కంపెనీకి ఇది మూడో బైబ్యాక్. 2019 ఆగస్ట్‌లో రూ.8,260 కోట్లతో 11.05 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. అంతకుముందు 2017 డిసెంబర్‌లో రూ.13,000 కోట్లతో 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. బైబ్యాక్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్ గత రెండు రోజులుగా భారీగా ఎగిసింది. నేడు మాత్రం ఊగిసలాటలో ఉంది. ఉదయం భారీగా లాభపడి, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి, మళ్లీ కోలుకుంది. మొత్తానికి బైబ్యాక్ సమయంలో ఊగిసలాటలో ఉంది. నేడు రూ.1560 వద్ద ట్రేడ్ అవుతోంది.

సరికొత్త గరిష్టాలకు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నిన్న సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ రెండు స్టాక్స్ దాదాపు 3 శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ నేడు మరింత ఎగిసి రూ.3386.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ షేర్ మరో నెల రోజుల పాటు రూ.15000 వద్ద ఉండే అవకాశముందని, రూ.1650 టార్గెట్‌గా, రూ.1450 స్టాప్ లాస్‌గా పేర్కొంటున్నారు మార్కెట్ నిపుణులు. టీసీఎస్ టార్గెట్ రూ.4400.


Click it and Unblock the Notifications