ప్రపంచంతో పాటు దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే చాలా మంది ఉద్యోగుల లక్షలు కాదు కోట్లలో కూడా జీతాలను అందుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే.. దేశంలోనే అతి పెద్ద ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.. ఈ టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగులు కోట్ల రూపాయల్లో జీతాలను తీసుకుంటున్నారు. దాదాపు 100 మందికి పైగానే ఉద్యోగులు కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నారు.
గతేడాది చాలా తక్కువగా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది చాలా బాగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.ఇక 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్‌లో ఈ ఏడాది మధ్యలో చేరడం విశేషంగా చెప్పుకోవచ్చు. వీరు నెలకు రూ. 8. 5 లక్షల కంటే ఎక్కువగానే జీతం పొందుతున్నారు. 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనాన్ని పరిశీలిస్తే.. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.203 కోట్లుగా ఉంది. వీరిలో సీఎఫ్‌వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్‌సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక గతేడాది కంపెనీలో కోటి కంటే ఎక్కువ జీతం తీసుకున్న వారి సంఖ్య 17 శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇన్పోసిస్ లాభాల బాటలో పయనించింది. ఏడాది వారీగా చూసుకున్నట్లయితే.. 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 124 మంది ఉద్యోగులు కోటి రూపాయల జీతం తీసుకోగా.. 2020లో 74 మంది మాత్రమే ఇలా తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా భారత్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారని.. టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ అధిక సంపాదన కలిగిన వారిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరం ముందు నుండే ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. మరికొందరు 1990 నుంచి పనిచేస్తున్నారు. ఇక 2025 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం చేసిన మొత్తం ఖర్చు 4 శాతం పెరిగి రూ. 5,950 కోట్లకు చేరుకుంది. ఈవ్యయం దాని మొత్తం ఆదాయంలో 53 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1.63 లక్షల కోట్లు కాగా మార్చి 2025 నాటికి కంపెనీ మొత్తం 3.24 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఇక ఇన్ఫోసిస్ ఈ మధ్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసిన క్రమంలో కంపెనీ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపింది.క్యాంపస్ నియామకాల కంటే అనుభవజ్ఞుల నియామకాలకు ఐటీ పరిశ్రమ ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో, ఇంటర్వ్యూ ప్రక్రియలో ఉద్యోగులు అందిస్తున్న సహకారాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కీమ్ కింద, నిర్వహించే ప్రతి ఇంటర్వ్యూకి ఉద్యోగికి 700 పాయింట్లు (అంటే రూ.700) లభిస్తాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications