ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కొంతమంది సీనియర్ ఉద్యోగులను తీసివేసేందుకు రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, డెలీవరీ మేనేజర్ల హోదాల్లో కొంతమందిపై వేటు వేసేలా కనిపిస్తోందట. జేఎల్ 6,7,8 స్థాయిలలో కోతలు ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి సంస్థలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఐటీ రంగంపై కూడా భారీగానే పడింది.

వారిలో 1,300 మందికి ఉద్వాసన
ఆర్థిక మందగమనం, కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో వ్యయ నియంత్రణ దిశగా ఇన్ఫోసిస్ అడుగు వేస్తోంది. దేశ, విదేశీ మార్కెట్లలో తగ్గిన వ్యాపార అవకాశాలు, పడిపోయిన ఆదాయం కారణంగా సంస్థ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగు వేయాల్సి వస్తోందని తెలుస్తోంది. జేఎల్ 7, 8 శ్రేణిల్లో 13 వేలమంది ఉండగా, 1,300 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందట.

రూ.40 లక్షల శాలరీ.. ఖర్చులు తగ్గుతాయి
జేఎల్ 6, 7, 8 వంటి సీనియర్ రోల్స్‌లో ఇన్ఫోసిస్‌లో 30,000 మంది వరకు ఉన్నారు. ఇందులో జేఎల్ 7, 8లో 13,000 మంది ఉంటే పది శాతం నుండి 15 శాతం మందికి ఉద్వాసన పలకవచ్చునని తెలుస్తోంది. ఐదంచెల వ్యవస్థను రెండంచెలుగా మార్చాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పునర్నిర్మాణం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తోందట. ఎందుకంటే మేనేజర్స్ వేతనాలు రూ.35 లక్షల నుండి రూ.40 లక్షల వరకు ఉన్నాయి. వీపీలు, ఎస్వీపీకు భారీ రెమ్యునరేషన్ ఉంది.

వర్క్ ఫోర్స్‌ను తగ్గించే ప్రణాళికలు లేవు
ఉద్వాసనపై కంపెనీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి వర్క్ ఫోర్స్‌ను తగ్గించే ప్రణాళికలు లేవని చెప్పారు. అయితే పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి సీనియర్ లెవల్‌లో పలువురు మేనేజర్లు ఉన్నారు.

పెరిగిన సీఈవో, సీఓఓల వేతనం
ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీవోవో ప్రవీణ్ రావుల వేతనాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. సలీల్ పరేఖ్ రూ.46.12 కోట్ల (6.1 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. బోనస్, ప్రోత్సాహకాలు, స్టాక్ యూనిట్స్ అన్నీ కలుపుకొని 27 శాతం పెరిగి రూ.46 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది (2018-19) ఆయన వేతనం రూ.4.8 మిలియన్లుగా ఉంది. సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వేతనం 29 శాతం పెరిగి 2.3 మిలియన్ డాలర్లు (రూ.17.3 కోట్లు)గా ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications