IT News: ఇన్ఫీ Q4 ఫలితాలు రిలీజ్‌.. లాభాలు పెరిగినా వెంటాడుతున్న సమస్యలు

Infosys Results: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత ఇన్ఫోసిస్ అతిపెద్ద IT సేవల కంపెనీగా కొనసాగుతోంది. ఇటీవల టాటా TCS తన Q4 ఫలితాలను విడుదల చేయగా.. ఇప్పుడు ఇన్ఫీ వంతు వచ్చింది. ఏప్రిల్ 18న గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి రిజల్ట్స్‌ పోస్ట్ చేసింది.

FY24 Q4లో లాభాల పరంగా మార్కెట్ వర్గాల అంచనాలను ఇన్ఫోసిస్ అధిగమించింది. 7 వేల 975 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. YoY 30 శాతం QoQ 30.5 శాతం వృద్ధి సాధించింది. స్థిరమైన కరెన్సీలో ఆదాయం ఏడాదికి 1.4 శాతం పెరిగింది. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 2 వేల 882 మిలియన్ డాలర్ల వద్ద బలంగా ఉంది. FY23తో పోలిస్తే 13.7 శాతం పెరిగింది.

Infosys released its Q4 results where the PAT up 30Percent YoY

'2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విలువ కలిగిన భారీ డీల్స్ సొంతం చేసుకున్నాం. ఖాతాదారులకు మాపై ఉన్న బలమైన నమ్మకానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. జనరేటివ్ AIలో మా సామర్థ్యాలను విస్తరిస్తూనే ఉన్నాము. క్లయింట్ ప్రోగ్రామ్‌లపై పని చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు కస్టమర్ సపోర్ట్ అంతటా ప్రభావం చూపే పెద్ద భాషా నమూనాలను బిల్డ్ చేసే పనిలో ఉన్నాం' అని కంపెనీ CEO మరియు MD సలీల్ పరేఖ్ తెలిపారు.

ఇంజినీరింగ్ R&D సేవలలో నిమగ్నమై ఉన్న ఇన్-టెక్ హోల్డింగ్ GmbH కొనుగోలుకు ఇన్ఫోసిస్ ఆమోదం పొందింది. ఈ వ్యూహాత్మక పెట్టుబడి ఇన్ఫోసిస్ R&D సామర్థ్యాలను మరింత బలపరుస్తుంది. దీంతో గ్లోబల్ క్లయింట్‌ల డిజిటల్ ఇంజనీరింగ్ ప్రయాణాన్ని నావిగేట్ చేయడంలో దాని నిరంతర నిబద్ధతను కంపెనీ పునరుద్ఘాటిస్తుంది.

వరుసగా ఐదవ త్రైమాసికంలోనూ కంపెనీలో నియామకాలు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే FY24లో ఉద్యోగుల సంఖ్య 25 వేల 994 తగ్గి 3.43 లక్షలకు చేరింది. కంపెనీ తన శ్రామికశక్తిలో తగ్గుదలని నివేదించడం గత ఇరవై సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్దిష్ట సంఖ్యను నిర్ణయించనప్పటికీ.. ఇప్పుడు మరింత చురుకైన మోడల్‌ను అనుసరిస్తున్నట్లు CFO సంఘ్‌రాజ్కా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+