IT News: విప్రోకు షాకిచ్చిన ఇన్పోసిస్.. పూర్తి విరుద్ధంగా వ్యవహారం.. ఫ్రెషర్లకు మాత్రం గుడ్‌న్యూస్
Infosys News: ఉద్యోగార్థులతో IT కంపెనీలు ఆడుకుంటున్నట్లు ఇటీవల పెద్దమొత్తంలో విమర్శలు వచ్చాయి. ఏళ్ల క్రిందట ఆపర్ లెటర్లు ఇచ్చి ఫ్రెషర్లను ఇప్పటికీ ఆన్‌బోర్డ్ చేయకుండా దాటవేస్తూ వస్తున్నాయి. విప్రో తన మాటమీద నిలబడకుండా వారికి గట్టి షాక్ ఇచ్చింది. దీంతో పెద్దఎత్తున ఆశావహులు నిరుత్సాహ పడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశీయ రెండో అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు 1 వెయ్యి మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ లెటర్‌లను రిలీజ్ చేసింది. ఈ మేరకు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్రెషర్‌లకు ఇచ్చిన మాటను కంపెనీ గౌరవిస్తుందని సంస్థ CEO సాహిల్ పరేఖ్ వారం క్రితం హామీ ఇవ్వగా.. ఇప్పుడు అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2022లో రోల్ ఆఫర్ చేయబడిన సిస్టమ్ ఇంజనీర్‌ల కోసం IT మేజర్ ఈ అప్‌డేట్ కోసం ఇచ్చింది. వీరు 2024లో రెండు ప్రీ-ట్రైనింగ్ సెషన్‌లను తీసుకోవాలని కోరింది. ఎట్టకేలకు అక్టోబరు 7న జాయినింగ్ డేట్ అంటూ ఇమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్‌లను జారీ చేసింది. మైసూర్ క్యాంపస్‌లో రిపోర్టు చేయాలని పేర్కొంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకముందే కంపెనీని వీడాల్సి వస్తే నష్ట పరిహారం కింద లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది.
2 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లను సిస్టమ్ ఇంజనీర్లు (SE) మరియు డిజిటల్ SE పాత్రల ఆన్‌బోర్డింగ్‌ను ఇన్ఫోసిస్ ఆలస్యం చేస్తుండటంపై NITES ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై IT మరియు ITES యూనియన్ ఇటీవల కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. కాగా వీరిప్పుడు 3.2 నుంచి 3.7 లక్షల వార్షిక ప్యాకేజ్ అందుకోనున్నారు.


Click it and Unblock the Notifications