ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల ప్రకటన.. పడిపోయిన లాభాలు.. తప్పిన అంచనాలు..
నిన్న టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) Q4 ఫలితాల తరువాత భారతదేశ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ Q4 ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025) నాల్గవ త్రైమాసిక నికర లాభంతో పోల్చి చూస్తే 12 శాతం క్షీణతతో (YoY) రూ.7,033 కోట్లకు చేరుకుందని నివేదించింది. ఈ మొత్తం అంచనాలైన రూ.7,278 కోట్ల కంటే తక్కువ.

అయితే జనవరి ప్రారంభంలో ఇన్ఫోసిస్ Q3 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే, అయితే ఆ సమయంలో లాభం రూ.6806 కోట్లుగా నమోదైంది, అంటే సంవత్సరానికి 11.46 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా Q3 ఆదాయం రూ.41,764 కోట్లుగా నమోదవగా, FY24 మూడవ త్రైమాసికంలో నమోదైన రూ.38,821 కోట్ల నుండి 7.58 శాతం ఎక్కువ. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ 0-3 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేసింది.
ఈ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.40,925 కోట్లుగా నమోదైంది, అయితే గతంతో పోలిస్తే 7.9 శాతం ఎక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం కూడా విశ్లేషకుల అంచనాల కంటే రూ.42,133 కోట్ల కంటే తక్కువగా ఉంది. Q4 ఫలితాలకు ముందు ఇన్ఫోసిస్ షేర్లు NSEలో 1 శాతం పైగా పెరిగి రూ.1,427.7 వద్ద ముగిశాయి.
8% పెరిగిన ఆదాయం : మార్చి 2025 త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం 8% పెరిగి రూ.40,925 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఐటీ కంపెనీ ఆదాయం రూ.37,923 కోట్లుగా ఉంది. మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్, కాన్స్టాంట్ కరెన్సీ పరంగా వార్షిక ప్రాతిపదికన 4.8 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. అయితే, కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన కాన్స్టాంట్ కరెన్సీ పరంగా 3.5 శాతం తగ్గింది.
6 నెలల్లో 27% కంటే ఎక్కువ పడిపోయిన షేర్లు : గత 6 నెలల్లో ఇన్ఫోసిస్ షేర్లు 27.89 శాతం పడిపోయాయి. ఈ ఐటీ కంపెనీ షేర్ ధర 17 అక్టోబర్ 2024న రూ.1969.50 వద్ద ఉండగా 17 ఏప్రిల్ 2025న నాటికి షేర్ ధర రూ.1420.20 వద్ద ముగిశాయి. అంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు దాదాపు 25 శాతం తగ్గాయి. అలాగే గత ఒక నెలలో కంపెనీ షేర్లు 10% కంటే ఎక్కువ పడిపోయాయి.


Click it and Unblock the Notifications


