Infosys: ప్రస్తుతం దలాల్ స్ట్రీట్ లో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో మెున్న టీసీఎస్ తన క్యూ3 ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ రోజు మరో ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ తన ఫలితాలను విడుదల చేసింది.

అంచనాలను మించి..
ఈ వారం ప్రారంభంలో విడుదలైన టీసీఎల్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. కానీ.. ఈ రోజు విడుదలైన ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మాత్రం ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణుల అంచనాలను మించి రావటం మార్కెట్లో కోలాహలానికి కారణమైంది. తాజాగా క్యూ3 ఫలితాల్లో కంపెనీ నికర లాభం 13.4 శాతం మేర పెరిగి రూ.6,586 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.5,809 కోట్లుగా ఉంది.

సూపర్ ఆదాయం..
బెంగళూరుకు చెందిన ఈ ఐటీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన 20 శాతం ఆదాయవృద్ధిని నమోదు చేసింది. దీంతో మెుత్తం ఆదాయం రూ.38,318 కోట్లకు చేరుకుంది. గతంలో మార్కెట్ వర్గాలు, నిపుణులు కంపెనీ ఆదాయం వృద్ధి 16-16.5 మధ్య ఉంటుందని అంచనా వేశారు. కంపెనీ విడుదల చేసిన ఫలితాల్లో లాభం, రాబడి రెండింటిలోనూ దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించాయి.

ఇన్ఫోసిస్ ప్రకటన..
స్థిరమైన కరెన్సీ పరంగా చాలా వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల్లో సంవత్సరానికి వృద్ధి రెండంకెల్లో ఉందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ప్రస్తుత సమయంలో భారీ డీల్స్ ఊపందుకోవడంలో ప్రతిబింబించే విధంగా, క్లయింట్‌ల కోసం విశ్వసనీయంగా మార్కెట్ వాటాను పొందటం కొనసాగిస్తోందని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. త్రైమాసికంలో రాబడుల వృద్ధి బలంగా ఉందన్నారు. డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ వంటి రంగాల్లో తమ ఉద్యోగులు అలుపెరగని అంకితభావంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications