ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో క్వార్టర్ (సెప్టెంబర్ త్రైమాసికం) ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 20.50 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,845 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.4,019గా ఉంది. పలువురు నిపుణుల అంచనాలను మించి ఇన్ఫోసిస్ నికర లాభాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి రేటు అంచనాలను 2-3 శాతం మేర పెంచుతూ సవరించింది. FY21 ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలను 23-24 శాతానికి సవరించింది.

పెరిగిన ఆదాయం..
క్లయింట్స్‌కు తమపై ఉన్న విశ్వాసం కొనసాగుతోందని, FY21 ఆదాయం, మార్జిన్ అంచనా పెరుగుదలను నమోదు చేస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. ఏడాది ప్రాతిపదికన 20.50 శాతం నికర లాభాలు నమోదు చేసిన ఇన్ఫోసిస్, వరుస త్రైమాసికంలో 14.4 శాతం ఏకీకృత లాభాన్ని నమోదు చేసి రూ.4,845 కోట్లకు పెరిగింది. వరుస త్రైమాసికాల్లో వృద్ధి నేపథ్యంలో పూర్తి ఏడాదికి వృద్ధి రేటు అంచనాలను పెంచింది.

పెరిగిన ఏకీకృత ఆదాయం
ఏడాది ప్రాతిపదికన డాలర్ టర్మ్‌లో ఇన్ఫోసిస్ ఆదాయం 3.2 శాతం పెరిగింది. క్వార్టర్లీ ప్రాతిపదికన 6.1 శాతం పెరుగుదలను నమోదు చేసి 3,312 మిలియన్ డాలర్లను నమోదు చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 840 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 20.7 శాతం, క్వార్టర్లీ ప్రాతిపదికన 18.7 శాతం పెరిగింది. బేసిక్ ఈపీఎస్ ఏడాది ప్రాతిపదికన 14.90 శాతం, క్వార్టర్ ప్రాతిపదికన 17 శాతం పెరిగింది. ఏకీకృత ఆదాయం 8.60 శాతం పెరిగి రూ.24,570 కోట్లు నమోదయింది.

మధ్యంతర డివిడెండ్ రూ.12
ఇన్ఫోసిస్ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.12ను ప్రకటించింది. మొదటి అర్ధ సంవత్సరంలో లిక్విడిటీ, నగదు నిర్వహణ దృష్టి సారించామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ అన్నారు. తాము మధ్యంతర డివిడెండ్‌ను రెండింతలు చేసి రూ.12కు పెంచుతున్నట్లు తెలిపారు. నేడు ఇన్ఫోసిస్ ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ ధర ఈ రోజు ఒత్తిడికి లోనయింది. ఇన్ఫోసిస్ షేర్ 1.71 శాతం మేర లాభపడి రూ.1,138 వద్ద ముగిసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications