Infosys Results: దుమ్ముదులిపే లాభాలు నమోదు చేసిన ఇన్ఫోసిస్.. పూర్తి వివరాలు
Infosys Q1 Results: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీనికి ముందు టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి.
మెుదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.5,945 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.37,933 కోట్లుగా నిలిచినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే FY24 ఆదాయ అంచనాలను కంపెనీ తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో ఆపరేటింగ్ మార్జిన్ 80 బేసిస్ పాయింట్లు పెరిగి 20.8 శాతంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఉద్యోగుల అట్రిషన్ విషయానికి వస్తే త్రైమాసికంలో 17.3 శాతానికి తగ్గింది. ఇది అంతకు ముందు మార్చి త్రైమాసికంలో 20.9 శాతంగా ఉండగా.. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో 28.4 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ 2.3 బిలియన్ డాలర్లు విలువైన పెద్ద డీల్స్ చేసుకోవటం భవిష్యత్తు వృద్ధికి బాటలు వేసిందని సీఈవో సలీల్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కంపెనీ జనరేటివ్ ఏఐ పై పెడుతున్న దృష్టి దాని వృద్ధికి దోహదపడుతోందని వెల్లడించారు. తమ ఏఐ ఉత్పత్తికి క్లైంట్స్ నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
రానున్న త్రైమాసికాల్లో పరిస్థితులు మారటం వల్ల మార్జిన్లు వృద్ధి చెందుతాయని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన ఉత్పాదకత చర్యలు, అధిక వినియోగంతో సహా ఇన్ఫోసిస్ కఠినమైన కార్యాచరణ క్రమశిక్షణ ఈ త్రైమాసికానికి మార్జిన్‌లకు సహాయపడిందని CFO నిలంజన్ రాయ్ వెల్లడించారు. ఫ్రీ క్యాష్ ఫ్లో లాభాల్లో 96.6 శాతం వద్ద బలంగా ఉందని, బలమైన మూలధన కేటాయింపు అమలు చేయడం వల్ల పెట్టుబడిదారులకు అధిక చెల్లింపులు జరిగాయని తెలిపారు.


Click it and Unblock the Notifications