Infosys News: దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి కంటే తక్కువ ఉద్యోగులకు సాధారణంగా ఏప్రిల్ నుంచి విడుదల చేసే జీతాల పెంపును వాయిదా వేసినట్లు వెల్లడైంది. కంపెనీలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది.
జూన్ త్రైమాసికంలో వేతన పెంపులను అందుకోలేదని చాలా మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు వెల్లడించారు. ఆలస్యం లేదా వేతనాల పెంపుల గురించి యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేదని వారు తెలిపారు. జూలైలో కంపెనీ తన సీనియర్ మేనేజ్‌మెంట్ కోసం వేతన పెంపులను ప్రకటించినప్పటికీ.. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.

ఇన్ఫోసిస్ గతంలో 2020 కరోనా మహమ్మారి సమయంలో నిధులను జాగ్రత్తగా నిర్వహించే క్రమంలో ఉద్యోగులకు వేతన పెంపులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 2021లో పెంపుదలలను తిరిగి ప్రారంభించింది. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, డీల్స్ వెనక్కి వెళ్లటం వంటి పరిస్థితులు కంపెనీలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. జూలై 20న కంపెనీ తన మెుదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. IT మేజర్ FY24లో 4-7 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది.
మొత్తం డిమాండ్ వాతావరణం మారిపోయిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ గత నెలలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని త్రైమాసికాలుగా అట్రిషన్ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications