కరోనా వైరస్ సమయంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత కనిపిస్తోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ వంటి కంపెనీ శాలరీ హైక్, ప్రమోషన్లు ఇవ్వనుంది. ఈ మేరకు సీఈవో సలీల్ పరేఖ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార అనిశ్చితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తోందని ఇటీవల సలీల్ పరేఖ్ ఈటీ-నౌ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, భారత్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

సాఫ్టువేర్ దిగ్గజం ఏప్రిల్ నెలలో కరోనా కారణంగా శాలరీ హైక్, ప్రమోషన్లు హోల్డ్‌లో ఉంచింది. అయితే ఆ తర్వాత కొంతమంది ఉద్యోగులకు హైక్స్ విషయంలో ఊరట కల్పించింది. అప్పుడు శాలరీ హైక్స్, ప్రమోషన్లు నిలిపివేసినప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని తెలిపింది.
కాగా, ఎన్ఎస్ఈలో ఈరోజు(సెప్టెంబర్ 21, సోమవారం) 55 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎంజైమ్ టెక్నాలజీస్, ఆషాపుర మిన్‌కెమ్, బఫ్నా ఫార్మాస్యూటికల్స్, బాలాక్సి వెంచర్స్, బ్రూక్స్ లేబోరేటరీస్, కాప్రి గ్లోబల్ కాపిటల్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, డైనమిక్ ప్రోడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, కార్దా కన్‍స్ట్రక్షన్స్, లారుస్ ల్యాబ్స్, విప్రో, మైండ్ ట్రీ, జైడస్, నాట్కో ఫార్మా 52 వారాల గరిష్టానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications