ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌..కట్ చేస్తే ఇప్పుడు దిగ్గజ కంపెనీ సీఈఓ.. దాదాసాహెబ్ భగత్ సక్సెస్ స్టోరీ ఇదిగో..

విజయం సాధించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు లేదా సంబంధాలు అవసరమని చాలామంది నమ్ముతారు. కానీ మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామానికి చెందిన దాదాసాహెబ్ భగత్ జీవితం ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తుంది. బీడ్ జిల్లాలో కరువు బారిన పడిన ప్రాంతంలో పుట్టిన అతను, చదువులో పెద్దగా ముందుకు వెళ్లలేదు. 10వ తరగతి వరకు మాత్రమే చదివి, తర్వాత ఒక సాధారణ ఐటీఐ కోర్సు పూర్తి చేశాడు.

అతని జీవితం ప్రారంభం నుంచి కఠినతరమే. ఉద్యోగం కోసం పూణేకు వెళ్లిన దాదాసాహెబ్ మొదట నెలకు కేవలం రూ.4,000 జీతంతో పనిచేశాడు. జీవితం గడపడం కష్టమని గ్రహించి, తరువాత ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా రూ.9 వేల జీతానికి చేరాడు. ఆ ఉద్యోగం అతనికి ఒక కొత్త దిశ చూపింది. రోజంతా శుభ్రం చేయడం, గదులు సర్దడం వంటి పనులు చేస్తూనే, కంప్యూటర్ల ముందు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను గమనించేవాడు. ఆ క్షణమే Dadasaheb Bhagat జీవితంలో మలుపు వచ్చింది. శరీరంతో కాకుండా మెదడుతో పని చేయడం ద్వారా మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని గ్రహించాడు.

Infosys success story Dadasaheb Bhagat story Infosys office boy to CEO Indian Canva founder Indian startup success story design startup India inspiring entrepreneur India Dadasaheb Bhagat Infosys Canva alternative India Made in India design tool Indian tech startup story motivational Indian entrepreneur CEO Canva Canva Dadasaheb Bhagat

తన సహచరులను అడిగి, తాను కూడా అలాంటి ఉద్యోగం ఎలా పొందగలనని తెలుసుకోవాలనుకున్నాడు. అతను కేవలం 10వ తరగతి వరకు చదివాడని తెలిసి, చాలామంది అది అసాధ్యమని చెప్పారు. అయితే కొందరు అతనికి గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ వంటి రంగాలు నేర్చుకోవాలని సూచించారు. అక్కడ ప్రతిభే ముఖ్యం, డిగ్రీ కాదని తెలిపారు.

చిన్ననాటి జ్ఞాపకాలు అతనిని ఆ దిశగా నడిపించాయి. చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు ఆలయ చిత్రకారుడి వద్ద నుంచి డ్రాయింగ్ నేర్చుకున్న దాదాసాహెబ్..ఆ ప్రతిభకు మళ్లీ జీవం పోశాడు. రోజులో డిజైన్ నేర్చుకుని, రాత్రిళ్లు ఇన్ఫోసిస్‌లో పనిచేయడం అతని రొటీన్‌గా మారింది. కేవలం ఒక సంవత్సరం లోపలే అతను ప్రొఫెషనల్ డిజైనర్‌గా ఎదిగాడు.తర్వాత తన సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు.

అయితే వ్యాపార మార్గం సులభం కాదు. COVID-19 లాక్‌డౌన్ సమయంలో కార్యాలయం మూసేయాల్సి వచ్చింది. అప్పుడతను తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. అక్కడ జీవిత ఖర్చులు తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటర్నెట్, విద్యుత్ లాంటి సౌకర్యాలు తక్కువ. అయినప్పటికీ, దాదాసాహెబ్ వెనక్కి తగ్గలేదు. తన బృందంతో కలిసి ఒక కొండపై, ఒక గోశాల దగ్గర చిన్న వర్క్‌స్పేస్‌ ఏర్పాటు చేసి పని మొదలుపెట్టాడు.

ఆ కొండపై ప్రారంభమైన చిన్న ఆలోచనే Design Template అనే భారతీయ డిజైన్ ప్లాట్‌ఫాం రూపం దాల్చింది. Canva వంటి గ్లోబల్ కంపెనీలకు పోటీగా నిలిచే ఈ ప్లాట్‌ఫామ్, భారతీయ మార్కెట్‌కి అనుగుణంగా రూపొందించబడింది. స్థానిక పిల్లలకు డిజైన్ నేర్పిస్తూ, గ్రామం నుంచే ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ రూపొందించడం అతని మిషన్‌గా మారింది. దాదాసాహెబ్ కథ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అతని మేక్ ఇన్ ఇండియా స్పిరిట్"ను ప్రశంసించారు. నేడు, Design Template ద్వారా ఆయన భారతదేశాన్ని సృజనాత్మక ప్రపంచ పటంలో నిలబెట్టారు.

దాదాసాహెబ్ భగత్ ఎప్పుడూ ఒకమాట చెబుతుంటారు. మీరు నిజంగా ఏదైనా విషయంపై ఆసక్తి చూపిస్తే ఆ మార్గం ఎంత కష్టమైనా, మీరు విజయం సాధిస్తారు.పెద్ద కలలతో, కష్టపడి పనిచేసి, సృజనాత్మకతను మీ ఆయుధంగా మార్చుకుంటే, ఏ ఆఫీస్ బాయ్ అయినా CEO అవ్వగలడని అతని కథ నిరూపిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+