విజయం అనేది ఎవరికీ అంత సులభంగా దక్కదు. అది కేవలం పట్టుదల, కఠోర శ్రమ ఉన్నవారికి మాత్రమే అది సొంతం. చాలామంది సామాన్య మధ్యతరగతి యువకులు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం అక్కడితో ఆగరు. చరిత్ర సృష్టించాలనుకుంటారు. అలాంటి వ్యక్తే దాదా సాహెబ్ భగత్ కూడా. ఒకప్పుడు ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్.. తర్వాత వారికే పోటీగా ఒక టెక్నాలజీ కంపెనీని స్థాపించి కోట్లు గడిస్తున్నాడంటే నమ్మగలరా?
ఆఫీస్ బాయ్‌గా ప్రయాణం మొదలు..
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించిన భగత్, పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.. ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసి, బతుకుదెరువు కోసం పూణే చేరుకున్నాడు. అక్కడ రూ. 4 వేల జీతానికి చిన్న పనిలో చేరాడు. అయితే ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తే రూ. 9 వేల జీతం వస్తుందని తెలిసి అక్కడ చేరాడు. అక్కడ ఆఫీస్ క్లీనింగ్ చేయడం, ఫైళ్లు అందించడం వంటి పనులు చేసేవాడు.
జీవితాన్ని మార్చిన ఆ ఒక్క ఆలోచన!
ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని హాయిగా పనిచేస్తున్న ఉద్యోగులను భగత్ గమనించేవాడు. శారీరక శ్రమ కంటే మేధస్సుతో చేసే పనికి ఎక్కువ గౌరవం, డబ్బు ఉంటాయని అతను గ్రహించాడు. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సలహా మేరకు, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. రాత్రి పూట ఉద్యోగం చేస్తూనే, పగలు గ్రాఫిక్ డిజైనింగ్ క్లాసులకు వెళ్లేవాడు. అలా కొంతకాలానికి డిజైనింగ్ మెళకువలు నేర్చుకుని కేవలం ఏడాదిలోనే ప్రొఫెషనల్ డిజైనర్‌గా మారారు.

ఆవుల కొట్టంలో ఆఫీస్.. ప్రధాని మోదీ ప్రశంసలు!
ప్రొఫెషనల్ డిజైనర్ గా మారిన భగత్ కు తర్వాత సొంతంగా కంపెనీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో అన్ని ఆలోచనలు మానుకుని తిరిగి తన గ్రామానికి వెళ్లాడు. కానీ, భగత్ మనసులో అదే ఆలోచన మెదులుతోంది. ఎలాగైనా ఒక కంపెనీ పెట్టాని బలంగా నిర్ణయించుకున్నాడు. అవకాశాల కోసం ఎదురుచూడకుండా మొదటి అడుగు వేశాడు. తన గ్రామంలోనే కంపెనీని మొదలుపెట్టాడు. సరైన విద్యుత్, ఇంటర్నెట్ లేకపోయినా ఒక ఆవుల కొట్టం పక్కనే చిన్న షెడ్డులో తన టీమ్‌తో కలిసి 'డిజైన్ టెంప్లేట్' (Design Template) అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. అందులో రకరకాల గ్రాఫిక్ డిజైనింగ్ టెంప్లేట్స్ అందుబాటులో ఉంచాడు. దాన్ని మరింత డెవలప్ చేసి.. ఒక పెద్ద గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రసిద్ధ 'కాన్వా' (Canva) కు గట్టి పోటీనిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయన చేసిన కృషిని చూసి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనను ప్రశంసించారు.
షార్క్ ట్యాంక్ ఇండియాలో మెరుపులు!
దాదాసాహెబ్ భగత్ ప్రయాణం అక్కడితో ఆగలేదు. రీసెంట్‌గా 'షార్క్ ట్యాంక్ ఇండియా' (Shark Tank India) సీజన్ 3లో తన ఐడియాను పిచ్ చేశారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని చూసి బోట్ (boAt) అధినేత అమన్ గుప్తా ఫిదా అయ్యారు. రూ. 10 కోట్ల వేల్యూయేషన్‌తో 10 శాతం వాటాకు గానూ రూ. 1 కోటి పెట్టుబడిని భగత్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ రూ. 1.6 కోట్లుగా ఉండగా.. వచ్చే ఏడాది నాటికి రూ. 3 కోట్లకు చేరుతుందని అంచనా.
మొత్తంగా భగత్ సక్సెస్ జర్నీ చాలామందికి ఇనిస్పిరేషన్. ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఫ్లోర్ క్లీన్ చేసిన చేతులే, నేడు ప్రపంచ స్థాయి డిజైన్లను సృష్టిస్తున్నాయి. సంకల్పం ఉంటే పేదరికం సాకు కాదని దాదాసాహెబ్ భగత్ నిరూపించారు. ఇప్పటి యువత.. భగత్ లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications