Infosys News: టెక్కీలను ఊరిస్తున్న ఇన్ఫోసిస్ ఆఫ్.. ట్రాన్ఫర్ అయితే రూ.8 లక్షలు ప్రోత్సాహకం..
IT News: దేశీయ ఐటీ దిగ్గజ ఇన్ఫోసిస్ తాజాగా ఉద్యోగులకు ఒక సూపర్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. టైర్-2 నగరంలో వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రోత్సాహక బదిలీ విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించింది.
దీని ప్రకారం ఇన్ఫోసిస్ ఉద్యోగులు కర్ణాటకలోని హుబ్బల్లి క్యాంపస్‌కు ఉద్యోగులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. వాస్తవానికి హుబ్బల్లిలో ఇన్ఫోసిస్ తగినంత ఉద్యోగాలు కల్పించడం లేదని హుబ్బళ్లి ఎమ్మెల్యే లేవనెత్తిన తర్వాత కంపెనీ నుంచి చర్యలు వచ్చాయి. కర్ణాటకలోని ఎమ్ఎల్ఏ అరవింద్ బెల్లాడ్ ఉద్యోగాల కల్పనలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నెరవేర్చలేదంటూ చేసిన ట్వీట్ దీని వెనుక అసలు కారణంగా తెలుస్తోంది. అయితే కంపెనీ తాజా ప్రకటనపై ఆయన సైతం ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేయడానికి ముందుకొచ్చే ఉద్యోగులకు రూ.8 లక్షల వరకు బదిలీ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ ద్వారా వెల్లడైంది. దేశంలోని ఏ క్యాంపస్ నుంచైనా ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇక్కడికి షిఫ్ట్ అవ్వొచ్చని పేర్కొంది. అయితే ఈ ప్రోత్సాహకాన్ని పొందటానికి బ్యాండ్ 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు అర్హులుగా కంపెనీ తేల్చి చెప్పింది.
ఇన్ఫోసిస్ ట్రాన్స్‌ఫర్ పాలసీ ప్రయోజనాలను పరిశీలిస్తే.. బ్యాండ్ 3, దిగువన ఉన్న ఉద్యోగులు రూ.25,000 ప్రారంభ పునరావాస భత్యాన్ని పొందేందుకు అర్హులుగా పేర్కొంది. దీని తర్వాత రెండు సంవత్సరాల్లో ప్రతి ఆరు నెలలకు అదనంగా రూ.25,000 అందించబడుతుందని స్పష్టం చేసింది. 24 నెలల తర్వాత మొత్తం రూ.1.25 లక్షలు అందించటంతో ఇది ముగుస్తుందని పేర్కొంది. అలాగే 4-6 బ్యాండ్స్ ఉద్యోగులకు ఇదే వ్యవధి ముగిసే సమయానికి, ప్రారంభ పునరావాస భత్యంతో కలిపి రీలొకేషన్ అలవెన్స్ రూ.8 లక్షల వరకు ఉంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది.
ముంబై-కర్ణాటక ప్రాంతానికి చెందిన ఉద్యోగులను హుబ్బల్లిలో అవకాశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ చొరవ లక్ష్యంగా ఉంది. ఈ చొరవను కర్ణాటక మంత్రి MB పాటిల్ ట్విట్టర్ వేదికగా ప్రశంశించారు. ఇన్ఫోసిస్ తన హుబ్బళ్లి క్యాంపస్‌కు బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఈ చర్య కిత్తూరు కర్ణాటక ప్రాంతంలోని స్థానిక ప్రతిభావంతులను ఇంటికి దగ్గరగా ఉన్న అవకాశాలను అన్వేషించడానికి, స్థానిక అభివృద్ధికి ప్రోత్సహిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications