Narayana Murthy: ప్రస్తుతం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారతదేశం తన విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులు, ప్రాముఖ్యత గురించి నారాయణ మూర్తి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరంపై కీలక కామెంట్స్ చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి భారత్ ఏటా ఒక బిలియన్ డాలర్లు ఖర్చుచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి 10 వేల మంది అత్యంత సమర్థులైన రిటైర్డ్ టీచర్లను పిలిపించాల్సి ఉంటుందన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 2500 ట్రైన్ ది టీచర్స్ కాలేజీలు తెరవాలన్నారు.

ఇలా చేయటం వల్ల భారతీయ ఉపాధ్యాయులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లలో మెరుగైన శిక్షణను పొందవచ్చని నారాయణ మూర్తి పేర్కొన్నారు. నలుగురు టీచర్ల బృందం ఏడాదిలో 100 మంది ప్రాథమిక, 100 మంది మాధ్యమిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగలదన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఏటా 2.5 లక్షల ప్రాథమిక, 2.5 లక్షల సెకండరీ శిక్షణ పొందిన ఉపాధ్యాయుల తయారవుతారని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ఒక సంవత్సరం పాటు ఉండాలని అన్నారు.
ఇదే సమయంలో మాట్లాడిన మరో ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు, ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. భారత జీడీపీ పెరుగుతున్న కొద్ది మనం భిన్నంగా ఏదైనా చేయాలని అన్నారు. దీనికి ముందు కొన్ని వారాల కిందట నారాయణమూర్తి దేశంలో యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications