Narayana Murthy: అంత వీజీ కాదంటున్న ఇన్ఫోసిస్ మూర్తి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సులువే..
Narayana Murthy: దేశంలో రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ సహవ్యవస్థాపకుడుగా ఉన్న నారాయణ మూర్తి ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. దేశాభివృద్ధి, విద్య, వైద్యం, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్, యువత పని గురించి అనేక అంశాలపై ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రతి ఒక్కరినీ దేశంలో ఆలోచింపజేస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మారటం లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం సులువునేనని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అయితే కంపెనీలను స్థాపించటం వాటిని విజయవంతంగా నడపటం, ఒడిదొడుకులను ఎదుర్కొని విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవటం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. అసలు ముందు వ్యాపారవేత్తగా మారాలంటే రిస్క్ తీసుకునే యువతకు బాసటగా నిలిచేలా మన సమాజంలో మార్పులు రావాలంటూ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు.

80వ దశకంలో కేవలం 6 మంది ఇంజనీర్లు కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించినట్లు మూర్తి వెల్లడించారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది యువత వ్యాపారవేత్తలుగా మారుతున్నారని.. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యంగా సమస్యలను పరిష్కరించాలనే ఉత్సాహం నేటి యువతలో అధికంగా ఉందని పేర్కొన్నారు.
దీనికి ముందు కొన్ని వారాల కిందట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని పేర్కొన్నారు. అయితే దీనిని కొందరు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు సమర్థించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. నేటి యువత హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
.


Click it and Unblock the Notifications