ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పని గంటల గురించి ప్రస్తావించారు. చైనా ఎకానమీ గురించి మాట్లాడుతూ ఇండియా చైనాను దాటాలంటే యువత ఎలా పని చేయాలో వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పి సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఈసారి చైనాలో ఒకప్పుడు అమల్లో ఉన్న 9-9-6 పని విధానాన్ని గురించి ప్రస్తావించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే యువత ఎక్కువ గంటలు పనిచేయడం తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చైనా అనుసరించిన కఠినమైన పనివిధానాల వల్లే ఆ దేశం చాలావేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. చైనాలో ఒకప్పుడు 9-9-6 అనే మోడల్ ను ఫాలో అయ్యేవాళ్లని, దానివల్లే ఆ దేశ ఎకానమీ చాలా వేగంగా డెవలప్ అయిందని చెప్పారు.
9-9-6 అంటే..
9-9-6 అంటే.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజుల పాటు పనిచేయడం. ఒకప్పుడు చైనాలోని ఉద్యోగులు ఇదే నియమాన్ని ఫాలో అయ్యేవాళ్లు. ఈ నియమం ప్రకారం పని గంటలు లెక్కేస్తే.. మొత్తం కలిపి వారానికి 72 గంటల పని అవుతుంది. దీంతో ఆయన మరోసారి 70 గంటల పని విధానాన్ని సమర్థించినట్టయింది. దేశంలోని వర్క్ కల్చర్ లో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ అని మరోసారి స్పస్టం చేశారు.
చైనాతో పోటీ పడాలంటే..
మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారత్ చైనాను అధిగమించగలదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అది సాధ్యమే కానీ, దానికి చాలా నిబద్ధత అవసరం అని చెప్పారు. ప్రస్తుతం చైనా ఎకానమీ మనకంటే ఆరు రెట్లు పెద్దదని. వారితో పోటీ పడాలంటే ప్రతి ఒక్కరూ అసాధారణంగా కృషి చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కంటే ముందు..
యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించే ముందు తమ కెరీర్‌ను నిర్మించుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నారాయణ మూర్తి అన్నారు. ప్రతి పౌరుడు, ఉద్యోగి, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు తాము హై స్టాండర్డ్స్ ను నిర్దేశించుకున్నప్పుడే భారత్ చైనాను అందుకోగలదు అని ఆయన అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని కూడా గుర్తు చేశారు.
సోషల్ మీడియా రెస్పాన్స్
నారాయణ మూర్తి కామెంట్స్ పై మరోసారి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. నారాయణ మూర్తి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. దేశంలో చాలామంది తక్కువ మౌలిక సదుపాయాలు, ఎక్కువ ఖర్చులతో జీవిస్తున్నారని కొందరు.. చైనా స్థాయిలో జీతాలు, మౌలిక సదుపాయాలు అందించిన తర్వాత పని గంటలపై మాట్లాడాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications