Narayana Murthy: ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు నారాణయ మూర్తి తన అభిప్రాయాలాను మెుహమాటం లేకుండా చెప్పే వ్యాపారవేత్త. ఇలా చేయటం వల్ల అనేకసార్లు విమర్శలను సైతం ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోతుంటారు.
1981లో కేవలం తన వాటాగా రూ.10,000తో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా మూర్తి మారారు. అయితే ఈ డబ్బును తన భార్య సుధా మూర్తి దాచుకున్న సొమ్మని పలుమార్లు గతంలోనే వెల్లడించారు. భార్య దాచుకున్న మెుత్తాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టి గొప్ప విజయాన్నిసాధించారు. దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఇన్ఫోసిస్ ను తీర్చిదిద్దటంలో ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. నేటి యువత వారానికి 70 గంటలు పనిచేయాలని.. తాను సైతం కంపెనీ వృద్ధి కోసం ఎక్కువ సమయాన్ని గడిపినట్లు కొన్ని నెలల కిందట సూచించిన సంగతి తెలిసిందే.

అయితే తన భార్య డబ్బుతో కంపెనీని ప్రారంభించినప్పటికీ ఆమెతో పాటు కుటుంబాన్ని కంపెనీకి దూరంగా ఉంచాలనే తన నిర్ణయానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి ఎక్కువ అర్హత ఉందని నమ్మినప్పటికీ.. తన భార్యను సంస్థలో చేరడానికి ఎప్పుడూ అనుమతించలేదని అన్నారు. పెట్టుబడిది డబ్బిచ్చిన భార్యకు కంపెనీలో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మంచి కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కుటుంబాన్ని దానిలోకి తీసుకురావడం కాదని తాను నమ్మటం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చారు.

ఆ రోజుల్లో ఇది కుటుంబ యాజమాన్యం మాత్రమే కాబట్టి, అన్ని రకాల పిల్లలు వచ్చి కంపెనీని నడిపేవారు, అన్ని చట్టాలను ఉల్లంఘించేవారని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ క్రమంలో అర్హత కలిగిన వారికి కంపెనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించకపోవటం తాను చేసిన తప్పుగా ఇన్ఫోసిస్ మూర్తి ఒప్పుకున్నారు. ఈ విషయంపై తాను అప్పట్లో తప్పుడు ఆలోచనను కలిగి ఉన్నానని చెప్పారు. ఇన్ఫోసిస్‌లో తాను ఇకపై ఎలాంటి పాత్ర పోషించనని, తాను కేవలం వాటాదారుని మాత్రమేనని స్పష్టం చేశారు. మూర్తి 1981-2002 వరకు 21 ఏళ్ల పాటు దేశంలోని రెండవ అతిపెద్ద సాంకేతిక సంస్థ అయిన ఇన్ఫోసిస్ CEOగా పనిచేశారు


Click it and Unblock the Notifications