Narayana Murthy: స్టోర్‌రూమ్‌లో పడుకున్న ఇన్ఫోసిస్ మూర్తి.. అసలు ఏం జరిగిందంటే..?
Infosys News: ఐటీ సేవల కంపెనీ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నారాయణమూర్తి తన ప్రయాణంలో ఎదుర్కొన్న పరిస్థితులను పంచుకున్నారు. కంపెనీ కోసం ఆయన పడిన కష్టాలను దీని ద్వారా గుర్తించవచ్చు.
ఇన్ఫోసిస్ ప్రారంభించిన తొలినాళ్లలో నారాయణమూర్తి ఒక క్లయింట్ కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన అక్కడ ఒక కిటికీలు లేని స్టోర్‌రూమ్‌లో అట్టపెట్టెపై పడుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. వాస్తవానికి క్లయింట్ సొంత ఇంటిలో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయని జగ్గర్‌నాట్ బుక్స్ ప్రచురించిన "యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" పుస్తకం వెల్లడించింది.

ఇక్కడ అమెరికాకు చెందిన క్లయింట్ డాన్ లిలెస్. అతను న్యూయార్క్‌కు చెందిన కంపెనీ డేటా బేసిక్స్ కార్పొరేషన్‌కు నాయకత్వం వహించేవాడు. అతను కావాలనే కొన్ని సందర్భాల్లో నారాయణ మూర్తిని తక్కువచేసి చూసేవాడని వెల్లడైంది. అలాగే కంపెనీ చెల్లింపులను వీలున్నప్పుడల్లా ఆలస్యం చేసేవాడు. అలాగే మూర్తి, ఇన్ఫోసిస్ సహచరులు మాన్‌హట్టన్‌లో అతనిని సందర్శించవలసి వచ్చినప్పుడు హోటల్‌లను బుక్ చేసుకోవడానికి సకాలంలో అధికారాన్ని అందించేవాడు కాదని పుస్తకం తేటతెల్లం చేసింది.
డాన్ ప్రవర్తన సరిగాలేనప్పటికీ కంపెనీ ఎదుగుతున్న ప్రారంభ దశల్లో నారాయణమూర్తి సహించారు. అయితే బాక్స్ సంఘటన మూర్తిని నిజంగా షాక్ చేసింది. అతిథిని భారతదేశంలో ప్రజలు చాలా గౌరవంగా చూస్తుంటారు. అయితే దీనిని సుధా మూర్తి తప్పుపట్టారు. ఎవరైనా ముందస్తు సమాచారం లేకుండా ఇంటికి వచ్చినప్పుడు సుధా తండ్రి తన ఆహారాన్ని వారికి అందించటంతో పాటు రాత్రికి భోజనం చేయకుండానే నిద్రించేవాడని ఆమె గుర్తుచేసుకున్నారు. దీంతో డాన్ ప్రవర్తన ఆమెను నిజంగా కోపానికి గురిచేసింది.


Click it and Unblock the Notifications