Narayana Murthy: కోడింగ్ చేసే టెక్కీలను AI రీప్లేస్ చేస్తుందా..? ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు
IT News: ఏఐ సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఉద్యోగుల మనుగడపై దెబ్బకొడుతోంది. పెద్దపెద్ద కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు వీలైనంత మేరకు ఏఐ టూల్స్ వినియోగించి ఉద్యోగుల ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే వ్యాపార మందగమనంతో ఉద్యోగాలు కోల్పోతున్న టెక్కీలకు ఏఐ కొత్త సవాలుగా మారింది.
ఈ క్రమంలో ఏఐ సాంకేతికత సామర్థ్యాలు, దాని ప్రభావం ఎంత ఉంటుందనే ఆందోళనలు చాలా మంది టెక్ ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి మానవ మనస్సు దేవుడు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన పరికరం అని అన్నారు. న్యూ ఏజ్ సాంకేతికతల గురించి చర్చలు ఉద్యోగ రిడెండెన్సీపై కాకుండా మానవులను మరింత ఉత్పాదకంగా మార్చడానికి ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ఉండాలని పేర్కొన్నారు.

AI స్పేస్‌లో కొత్త టూల్స్ అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయనే ఆందోళనలు మిన్నంటుతున్న వేళ మూర్తి వ్యాఖ్యలు వచ్చాయి. ఈ క్రమంలో నారాయణమూర్తి 1975లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు స్థానభ్రంశం చెందుతాయని భయపడ్డ "కేస్ టూల్స్" ప్రవేశం గురించి ప్రస్థావించారు. అయితే అప్పుడు అందరూ ఊహించినట్లు జరగలేదని మూర్తి చెప్పారు. కేస్ టూల్స్, ప్రోగ్రామ్ జనరేటర్ల సాంకేతికత కనుగొనబడినప్పుడు, మానవులు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఏఐ, ఏఐ జనరేటివ్ టూల్స్ టెక్కీలను మరింత సమవర్థవంతంగా పనిచేసేందుకు టెక్కీలకు సహాయకారిగా నిలుస్తాయని ఐటీ వెటరన్ పేర్కొన్నారు. వీటి వల్ల ఉద్యోగాలు పోతాయనే చర్చలు కాకుండా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడతాయని భావించాలన్నారు. దీనికి ఇన్ఫోసిస్ మూర్తి ఉదాహరణ ఇస్తూ.. గతంలో బ్యాంక్ లెడ్జెర్ రికన్సీలియేషన్ గతంలో ఎంత సమయం పట్టేదో గర్తుచేశారు. అయితే టెక్నాలజీ అభివృద్ధితో నేడు ఆటోమేషన్ అవ్వటం వల్ల ఇది పనిని సులభతరం చేసిందని అన్నారు. ఆటోమేషన్ మానవజాతిని మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని మూర్తి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications