Infosys Murthy: 70 గంటల పని కామెంట్లపై దిగొచ్చిన మూర్తి.. 40 ఏళ్లుగా చేసింది అదే.. వైరల్
70 Hours Work: కొన్ని నెలల కిందట దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ పిలుపునివ్వటం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా కాలంగా కొనసాగుతున్న చర్చపై చివరికి నారాయణమూర్తి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
వారానికి ఒక వ్యక్తి ఇన్ని గంటలు పనిచేయాలనేది వ్యక్తిగత విషయమని, తప్పనిసరిగా 70 గంటలు చేయాలని ఎవరూ చెప్పరని, హార్డ్ వర్క్ అనేది వ్యక్తిగత ఎంపికగా పేర్కొన్నాడు. ప్రజలు తమ పని గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. చేసే పనిపట్ల కమిట్మెంట్ గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇది ఉద్యోగిని కెరీర్ లో ముందుకు తీసుకెళ్లటానికి దోహదపడుతుందని అన్నారు. బాహాటంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని వ్యక్తిగత విషయంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పేర్కొన్నారు.

తాను ఇన్ఫోసిస్ కంపెనీలో 40 ఏళ్లపాటు ప్రతిరోజూ ఉదయం 6.30కి వెళ్లి సాయంత్రం 8.30 వరకు పనిచేసేవాడినని పేర్కొన్నారు. తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇది వాస్తవమని ఇది వ్యక్తిగత ఎంపికని అన్నారు. ఇలాగే చేయాలి లేదా చేయకూడదు అని ఎవ్వరూ చెప్పరని తాను వారానికి 70 గంటలు పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
కొద్ది రోజుల ముందు ఎల్ అండ్ టి చైర్మన్ సుబ్రహ్మణియన్ వారానికి 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు ఇంటి వద్ద భార్య ముఖం చూసుకుంటూ సమయం వృధా చేయెుద్దని కామెంట్స్ చేసిన క్రమంలో నారాయణమూర్తి తాజా కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమనే అంశంపై చాలా పెద్ద డిబేట్ జరుగుతోంది. యజమాని అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం తమకు లేదంటూ చాలా మంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారవేత్తలు కష్టపడి దేశానికి పన్నులు చెల్లించటం వల్లనే పేదరికంలో ఉన్న ప్రజలను పైకి తీసుకురావటానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ భారతదేశంలో 60 శాతం మంది ప్రజలు ఉచితంగా అందించే రేషన్ సరకులపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ విధానం విశ్వసనీయత గురించిన ఆందోళనలను కూడా మూర్తి ప్రస్తావించారు. కార్పొరేట్ దురాశ ప్రజల అపనమ్మకానికి మూలకారణమని పేర్కొన్నారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ప్రముఖుల అభిప్రాయాలు..
RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ విజయానికి సంబంధించిన వంటకం కాదని అన్నారు. ఇదే క్రమంలో ITC లిమిటెడ్ చైర్మన్ సంజీవ్ పూరి ఉద్యోగులు పని గంటల సమయం కంటే వారి సామర్థ్యాన్ని గ్రహించి, మంచి పనితీరును కనబరచడం చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications