Narayana Murthy: ఇన్ఫోసిస్ మూర్తి మనవడి ఆస్తి చూస్తే షాకైపోతారు.. 4 నెలల వయస్సులోనే..

Infosys Murthy: దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. కొన్ని నెలల కిందట యువత రోజుకు 70 గంటలు పనిచేయాలంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన మనవడు ఏకాగ్రా రోహన్ వార్తల్లో నిలిచారు.

నారాయణమూర్తి నాలుగు నెలల మనవడు ఏకాగ్రా రోహన్ మూర్తి రూ.240 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా నిలిచాడు. బీఎస్ఈ ఫైలింగ్స్ డేటా ప్రకారం హోహన్ ఇన్ఫోసిస్ కంపెనీలో 15 లక్షల షేర్లను కలిగి ఉన్నాడు. నారాయణమూర్తి అందించిన 0.04 శాతం విరాళం తర్వాత కంపెనీలో ఆయన వాటా 0.36 శాతానికి తగ్గింది. మనవడికి షేర్లను గిఫ్ట్ రూపంలో అందించిన తాజా లావాదేవీ ఆఫ్ మార్కెట్ పద్ధతిలో జరిగిందని సమాచారం.

Infosys Narayana Murthy gifted 240 crores worth shares to grand son Ekagrah Murthy

నారాయణమూర్తి 1981లో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. కంపెనీ మార్చి 1999లో యూఎస్ స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో జాబితా చేయబడింది. నారాయణమూర్తి - సుధా మూర్తికి ఇద్దరు పిల్లలు. వారికి కుమారుడు రోహన్ మూర్తి, కుమార్తె అక్షతా మూర్తి ఉన్నారు. రోహన్ మూర్తి-అపర్ణ కృష్ణన్ కుమారుడు ఏకాగ్రా రోహన్ 2023లో జన్మించాడు.

ఏకాగ్రా రోహన్ మూర్తి నాన్నమ్మ సుధా మూర్తి రాజ్యసభ నుంచి ఎంపీ అయ్యారు. ఆమె రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంపీ. ఆమె ఇప్పటికే దేశంలో ప్రసిద్ధ రచయిత్రి, సామాజిక కార్యకర్తగా మనందరికి సుపరిచితం. గతంలోనూ సుధా మూర్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఆలోచనలను యువతతో పంచుకున్న సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+