Narayana Murthy: ఇన్ఫోసిస్ మూర్తి ఫ్యామిలీకి రూ.6800 కోట్ల నష్టం.. ఎందుకంటే..?

Infosys News: ఇటీవలి రోజుల్లో ఇన్ఫోసిస్ షేర్ల ధరలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. అనేక బ్రోకరేజ్ సంస్థలు సైతం ఈ క్రమంలో అనేక ఐటీ రంగంలోని కంపెనీ షేర్ల రేటింగ్ మార్కచటంతో పాటు తమ నూతన టార్గెట్ ధరలను ప్రకటించాయి. ఈ సమయంలోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సంపదలో సుమారు రూ.6,800 కోట్ల మేర తగ్గుదల నమోదైంది.

వివరాల్లోకి వెళితే నేడు ఇన్ఫోసిస్ షేరు 5.49% తగ్గి రూ.1,569.35 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ 2024లో రూ.2,006.80 వద్ద 52 వారాల గరిష్టానికి పోల్చితే సుమారు 22% తగ్గుదలను నమోదు చేసింది. ఈ తగ్గుదల నారాయణ మూర్తి కుటుంబ సభ్యుల సంపదపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. నారాయణ మూర్తి కుటుంబం ఇన్ఫోసిస్‌లో కలిపి 4.02% వాటాను కలిగి ఉంది. ఈ వాటా విలువ రూ.26,287 కోట్లకు తగ్గింది. డిసెంబర్ 13, 2024 నాటికి రూ.33,163 కోట్లతో పోల్చితే మూర్తి ఫ్యామిలీ హోల్డ్ చేస్తున్న వాటాల విలువ రూ.6,875 కోట్ల తగ్గుదలను నమోదు చేసింది.

Infosys Narayana Murthy family wealth erodes by 6 800 crores in bear market

కుటుంబ సభ్యుల వ్యక్తిగత వాటా వివరాలను పరిశీలిస్తే..
- నారాయణ మూర్తి: 0.40% వాటాతో ఆయన సంపద రూ.3,299 కోట్లకు తగ్గింది, ఇది రూ. 684 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
- సుధా నారాయణ మూర్తి: 0.92% వాటాతో ఆమె సంపద రూ.7,600 కోట్లకు తగ్గింది, ఇది రూ.1,573 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
- రోహన్ మూర్తి: 1.62% వాటాతో సంపద రూ.13,378 కోట్లకు తగ్గింది, ఇది రూ.2,771 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
- అక్షత మూర్తి: 1.04% వాటాతో సంపద రూ.8,591 కోట్లకు తగ్గింది, ఇది రూ.1,779 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
- ఎకాగ్రహ్ రోహన్ మూర్తి: 0.04% వాటాతో సంపద కూడా తగ్గుదలకు లోనైంది

ఈ తగ్గుదల ఇన్ఫోసిస్ షేర్ల ధర పడిపోటం వల్ల జరిగింది. దీని వల్ల కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ సుమారు రూ.46,108 కోట్లు కరిగిపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.7.54 లక్షల కోట్లకు తగ్గింది. ఇన్ఫోసిస్ తాజా త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. విస్తృతమైన ఆర్థిక పరిస్థుతులు, గ్లోబల్ మార్కెట్ ఒత్తిడులు ఇన్వెస్టర్ల మనోభావాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఈ పరిస్థితులను గమనిస్తూ ఇన్ఫోసిస్ సహా ఇతర ఐటీ కంపెనీల ప్రదర్శనపై దృష్టి సారిస్తున్నారు.

Take a Poll

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+