Narayana Murthy: ఉచితాలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..!
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇటీవల అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని కామెంట్స్ వ్యతిరేకతను అందుకుంటున్నాయి.
తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఉచితాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రేట్లలో సేవలను పొందిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలని ప్రజలను కోరారు. భారత్ సంపన్నమైన దేశంగా మారాలంటే పెట్టుబడిదారి విధానం మాత్రమే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

తాను ఉచితాలకు వ్యతిరేకిని కాదని పరిస్థితులను తాను సైతం అర్థం చేసుకోగలని అన్నారు. తాను సైతం పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని, అయితే ఆ ఉచిత రాయితీలను పొందిన వారి నుంచి సమాజానికి కొంత బాధ్యతను తిరిగి ఆశించాలని అన్నారు. పథకాలను పొందే వ్యక్తులు వారి పిల్లలు, మనవళ్లు మనవరాళ్లు, భవిష్యత్తు తరాల మేలు కొరకు వారిని పాఠశాలకు పంపే విషయంలో మెరుగ్గా ఉండేలా పెద్ద బాధ్యత స్వీకరించాలని అన్నారు.
దేశంలో సమర్థవంతమైన, అవినీతి రహిత, ప్రభావవంతమైన ప్రజా వస్తువులను సృష్టించడానికి.. అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తున్న దానికంటే ఎక్కువ పన్నులు ఉండాలన్నారు. మనలాంటి సమస్యలు ఉన్నప్పటికీ చైనా.. భారత్ కంటే 5-6 రెట్లు జీడీపీకి చేరుకుందని మూర్తి తెలిపారు. అందువల్ల రాజకీయ నాయకులు చైనాను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి, చైనా నుంచి మనం నేర్చుకోగల మంచి విషయాలు ఏమిటో చూడాలని అన్నారు. దీనివల్ల ఇండియా చైనాలాగా వేగంగా వృద్ధి బాట పడుతుందన్నారు.


Click it and Unblock the Notifications